Mega Star and Power Star : ‘దొంగ’ సినిమాలో గోలీమార్.. పాట గుర్తుంది కదా. ‘కాష్మోరా కౌగిలిస్తే.. ఏం చేస్తావో..’ అంటూ మెగాస్టార్ చిరంజీవి ఈ పాటకు తెగ బ్రేక్ డాన్సులేసేస్తారు. హీరోయినని టీజ్ చేసే క్రమంలో హీరో జాంబీలా వేషం కట్టి ఈ పాటలో చిందులేస్తాడు. ఈ పాట అప్పట్లో ఓ సెన్సేషన్. అఫ్‌కోర్స్ అప్పటికీ, ఇప్పటికీ కూడా ఎవ్వర్ గ్రీన్ సాంగ్ ఇది.
పాటే కాదు, ఈ పాట కోసం చిరంజీవి వాడిన కాస్ట్యూమ్స్ అంతకన్నా సెన్సేషన్. ఈ పాటలో చిరంజీవి ఓ జాకెట్ ధరిస్తాడు. అది స్వయానా మైఖేల్ జాక్సన్ ధరించిన జాకెట్ అని అంటారు. కేవలం ఈ పాట కోసమే చాలా డబ్బులు ఖర్చు చేసి ఆ జాకెట్ తెప్పించారట మెగాస్టార్ చిరంజీవి. ఆ జాకెట్ ధరించి, మైఖేల్ జాక్సన్ రేంజ్‌లోనే మెగాస్టార్ డాన్స్ స్టెప్పులు ఇరగదీసేశారనుకోండి.
ఇక, అలాంటి జాకెట్‌నే పవన్ కళ్యాణ్ కూడా ధరించారు. ‘కొమరం పులి’ సినిమా కోసం. అయితే, పవన్ కళ్యాణ్ సంగతి తెలిసిందే కదా. ఏ విషయంలోనూ అన్నయ్య చిరంజీవితో అస్సలు పోల్చుకోరు. నేనింతే. నాకింతే వచ్చు.. అంటారు ముఖ్యంగా డాన్సుల విషయంలో ఆయన. మైఖేల్ జాక్సన్ జాకెట్ అయితే ధరించారు కానీ, ఆ రేంజ్ డాన్సులు చేయడంలో విఫలమయ్యారు.
కానీ, ఈ సినిమాలో డాన్సుల కోసం కాస్త ఎక్కువగానే కష్టపడ్డాడు పవన్ కళ్యాణ్. అటూ ఇటూ, కాళ్లూ చేతుల కొంచెం గట్టిగానే కదిపారు. కానీ, చిరంజీవి గోలీమార్ సాంగ్ రేంజ్‌లో పవన్ కళ్యాణ్ పాట హిట్ కాలేదు. అలాగే, పవన్ ధరించిన జాకెట్ విషయంలోనూ ఏమంత పాజిటివ్ రెస్పాన్స్ రాలేదీ సినిమాలో.