Ram Charan: OTT లో అడుగుపెట్టబోతున్న మెగా పవర్ స్టార్ చరణ్..!

Ram Charan: రామ్ చరణ్ చిరంజీవి కొడుకు కాగా మెగా వారసుడుగా ఫిల్మ్ ఇండస్ట్రీలో అడుగు పెట్టిన చాలా తక్కువ టైంలో తండ్రికి తగ్గ తనయుడు అనిపించుకున్నాడు. డాన్సులోను నటనలోనూ తనని తను ప్రూఫ్ చేసుకుని టాప్ హీరోస్ లో ఒకడిగా ఉన్నాడు. రాజమౌళి డైరెక్షన్ లో మగధీర సినిమాతో మాస్ హీరో ఇమేజ్ సొంతం చేసుకున్న చరణ్ మరొకసారి రాజమౌళి డైరెక్షన్ లో RRR సినిమా తో ఎన్టీఆర్ తో కలిసి నటించారు ఈ సినిమా భారీ అంచనాల మధ్య మార్చి 25 న రిలీజ్ కి సిద్దమవుతోంది.

అయితే ఈ సినిమా తర్వాత రామ్ చరణ్ ఒక ఇంటరెస్టింగ్ ప్రాజెక్ట్ చేయబోతున్నట్లు ఫిల్మ్ నగర్ టాక్. నెట్ ఫ్లిక్స్ ఇండియా నిర్మించబోతున్న భారీ బడ్జెట్ వెబ్ సిరీస్ కోసం రామ్ చరణ్ ను సంప్రదించరాని సమాచారం. ఈ ప్రాజెక్ట్ ఓకే అయితే రామ్ చరణ్ వెబ్ సిరీస్ తో ఫాన్స్ కి మరింత దగ్గరవుతారు.
ప్రస్తుతం చరణ్ RC15 ప్రాజెక్ట్ షూటింగ్ తో బిజీగా ఉన్నారు. ఈ సినిమాను శంకర్ డైరెక్షన్ చేస్తున్నారు.

ఇక రామ్ చరణ్ తన తండ్రితో కలిసి చేస్తున్న మూవీ ఆచార్య సినిమా కూడా త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఇక రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కిన RRR సినిమా కూడా మార్చి 25 వ తేదీన ప్రేక్షకుల ముందుకు రాబోతున్నడంతో ఈ సినిమాపై భారీ అంచనాలు పెరిగాయి. ఇక ఇందులో రామ్ చరణ్ అల్లూరి సీతారామరాజు పాత్రల్లో నటిస్తున్నారు.