వకీల్ సాబ్’లో చరణ్, అఖీరా ఉన్నారా ?

Mega kids to be appear in Vakeel Saab
Mega kids to be appear in Vakeel Saab
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ‘వకీల్ సాబ్’ ఈ నెల 9వ తేదీన విడుదలకానుంది.  అభిమానులైతే పవన్ ను ఎప్పుడెప్పుడు సిల్వర్ స్క్రీన్ మీద చూస్తామా అనే ఆతురుతలో ఉన్నారు.  సినిమా రిజల్ట్ తరవాత సంగతి ముందు పవన్ ను స్క్రీన్ మీద చూస్తే చాలని అనుకుంటున్నారు.  అందుకే మేకర్స్ సినిమాను అన్ని విధాలా అభిమానులకు ట్రీట్ ఇచ్చేలా రూపొందించారట.  సినిమా అలా ఉంటుంది ఇలా ఉంటుంది, ఎలివేషన్స్ పలానా విధంగా ఉంటాయి అంటూ రకరకాల కథనాలు వినబడుతున్నాయి.  
 
అయితే తాజాగా ఇంకొక వార్త కూడ ఫిల్మ్ నగర్ వర్గాల్లో హల్ చల్ చేస్తున్నాయి.  అదేమిటంటే సినిమాలో రామ్ చరణ్, అఖీరాలు కాసేపు కనబడతారట.  వాళ్ళు మాత్రమే కాదు సాయి తేజ్, వైష్ణవ్ తేజ్ కూడ కనిపిస్తారని అంటున్నారు.  వాళ్లంతా ‘వకీల్ సాబ్’ షూటింగ్ లొకేషన్లో ఉన్న ఫోటోలు సైతం సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తున్నాయి.  ఒకవేళ ఈ వార్తలే నిజమైతే ఈ వారసులంతా కోర్ట్ రూమ్ సన్నివేశాల్లో ఎక్కడో ఒక చోట కనబడే అవకాశం ఉంది.  ఈ వార్త తెలియడంతో మెగా అభిమానుల్లో ఆసక్తి ఇంకాస్త ఎక్కువైంది.