నవీన్ చంద్రను అవమానించిన మెగా హీరోయిన్

తెలుగు లో ఉన్న టాలెంటెడ్ నటుల్లో నవీన్ చంద్ర ఒకరు. హీరో గా కెరీర్ మొదలుపెట్టిన నవీన్ చంద్ర ఇప్పుడు క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా, విలన్ గా బిజీ గా ఉన్నాడు. ఎలాంటి బాక్గ్రౌండ్ లేకుండా వచ్చిన నవీన్ కెరీర్ మొదట్లో చాలా ఇబ్బందులు పడ్డాడు. చాలా మంది లాగ కెరీర్ మొదట్లో నవీన్ చంద్ర కూడా కొన్ని ఇబ్బందులు పడ్డాడు. రీసెంట్ గా ‘పరంపర’ వెబ్ సిరీస్ లో నటించిన అద్భుతమైన నటనతో పాజిటివ్ టాక్ సంపాదించుకున్న నవీన్ చంద్ర ..కోలీవుడ్ లో కూడా వరుస ఆఫర్స్ తో బిజీ గా ఉన్నాడు.

కెరీర్ మొదట్లో చాలా ఫైనాన్సియల్ ఇబ్బందులు పడ్డ నవీన్ చంద్ర కి ఒక అవమానం జరిగిందంట. ఆ ఫైనాన్షియల్ స్టేటస్ ను చూపిస్తూ ఓ హీరోయిన్ నవీన్ చంద్రాను చులకన చేసి మాట్లాడిందట. అప్పట్లో మెగా హీరోలతో వరుస పెట్టి సినిమాలు చేసే ఓ హీరోయిన్ నవీన్ చంద్ర తో కూడా సినిమా చేసింది. అయితే ఆ సినిమా టైంలో మాత్రం ఆ హీరోయిన్  చాలా కూల్ గా చాలా మర్యాదగా మాట్లాడుతూ వచ్చిందట. సినిమా హిట్ అవ్వడం కోసం నవీన్ చంద్రతో రాసుకొని పూసుకుని తిరిగి ప్రేమ అంటూ పుకార్లు పట్టించుకోని తన పేరు మీడియాలో హైలెట్ గా మార్చుకుంది.

ఆ తర్వాత పుకార్ల ప్రభావమో అమ్మడు ఎక్స్పోజింగ్ ప్రభావమో తెలియదు కానీ సినిమా అయితే హిట్ అయ్యింది.  కానీ నవీన్ చంద్ర ను మాత్రం దారుణంగా మోసం చేసింది. ప్రేమ పేరుతో నవీన్ చంద్రకు దగ్గర అయ్యిన్నట్లే అయ్యి.. ఆ తర్వాత స్టేటస్ పేరుతో “నువ్వు నా స్థాయికి తగ్గవాడివి కాదు “అంటూ దారుణంగా అవమానించిందట. “ఇండస్ట్రీలో నీ స్థాయి ఏంటో తెలుసుకో” అంటూ నవీన్ చంద్ర బాధపడే లా మాట్లాడిందట.

ఆలా ఆ హీరోయిన్ఆ అవమానించేసరికి  కన్నీళ్లు పెట్టుకున్న నవీన్ చంద్ర ఇప్పటివరకు ఆ హీరోయిన్ ముఖం కూడా మళ్లీ చూడలేదట. ఇంతకీ ఆ హీరోయిన్ ఎవరో నవీన్ చెప్పలేదు.