మెగా హీరోలకు అభిమానుల మీద ఇంత ప్రేమేంటో !

Mega fans super excited with new posters

Mega fans super excited with new posters

మెగా హీరోల్లో చిరి, పవన్, చరణ్ క్రేజ్ ప్రత్యేకమైంది. భారీ ఫ్యాన్ బేస్ ఉన్న హీరోలు ఈ ముగ్గురూ. వీరి సినిమాలంటే మెగా అభిమానులకు పండుగే అనాలి. ఈ ఏడాదిలో అలాంటి పండుగే ఉండబోతోంది. చరణ్ నుండి ‘ఆర్ఆర్ఆర్’, పవన్ నుండి ‘వకీల్ సాబ్’, చిరు నుండి ‘ఆచార్య’ వస్తున్నాయి. అంతేకాదు ఈ సంవత్సరం పవన్ నుండి ఇంకొక సినిమా కూడ రిలీజవుతుంది. ‘ఆచార్య’లో చూస్తే చిరు, చరణ్ కలిసి నటిస్తున్నారు. ఈ విషయాలన్నీ అభిమానుల్ని తెగ ఎగ్జైట్ చేస్తున్నాయి.

ఇక రేపు 27వ తేదీన రామ్ చరణ్ పుట్టినరోజు కావడంతో ఫ్యాన్స్ కోసం వరుస ట్రీట్స్ ప్లాన్ చేశారు. ఈరోజు సాయంత్రం ‘ఆర్ఆర్ఆర్’ నుండి అల్లూరి సీతారామరాజు గెటప్లో చరణ్ పోస్టర్ ఒకటి రిలీజవుతుంది. అలాగే రేపు ‘ఆచార్య’ నుండి సిద్ద ఫస్ట్ లుక్ పోస్టర్ విడుదలచేయనున్నారు. వీర్దికి కొసరు అన్నట్టు 28వ తేదీన ‘వకీల్ సాబ్’ పోస్టర్ ఒకటి వదులుతున్నారు. ఇలా మూడు రోజులు మెగా అభిమానులకు మూడు ట్రీట్స్ అన్నమాట. మొత్తానికి మెగా హీరోలు ఈ ఏడాది మెగా అభిమానుల మీద బోలెడంత ప్రేమను కురిపించేస్తారన్నమాట.