మళ్ళీ ఆందోళనలో మెగా ఫాన్స్..ఈసారి మ్యాజిక్ జరగాల్సిందేనట..!

Mega Fans : టాలీవుడ్ దిగ్గజ హీరోల్లో ఒకరైన మెగాస్టార్ చిరంజీవి హీరోగా నటించిన లేటెస్ట్ సినిమా “ఆచార్య” తన కెరీర్ లో ఉన్నటువంటి ఒక ఘోరమైన ప్లాప్ చిత్రాల్లో ఒకటిగా నిలిచింది. దాదాపు సగానికి పైగా లాసులతో ఈ చిత్రం డిజాస్టర్ గా నిలిచిపోయింది. అయితే కారణాలు చాలా ఉండొచ్చు కానీ ఈ సినిమా దెబ్బతో మెగా ఫ్యాన్స్ దారుణంగా డీలా పడిపోయారు.

ఇక దీనితో నెక్స్ట్ రిలీజ్ లపై అభిమానులు ఒకింత ఆందోళనగా ఉన్నారు. అయితే అవి రీమేక్ సినిమాలు హిట్ అని ఆల్రెడీ అందరికీ తెలుసు పైగా ఈ ఏడాదిలోనే ఆగష్టు లో “గాడ్ ఫాదర్” రిలీజ్ ఉండొచ్చని గట్టి టాక్ వినిపిస్తుంది. అయితే ఇంకా సమయం తక్కువే ఉంది సినిమా రెడీ అయ్యిపోయినా కూడా ఆచార్య కి చేసినట్టే మళ్ళీ ఇదే నిర్మాణ సంస్థ కొణిదెల వాళ్ళు చేస్తే ఇంకో డిజాస్టర్ ఖాయం అని ఇప్పుడు నుంచే భయపడుతున్నారు.

దీనితో ఈ సినిమాకి గాని మంచి ప్రమోషన్స్ చెయ్యకపోతే మళ్ళీ తలెత్తుకోలేం అంటున్నారు. మరి ఈ సినిమాకి ఎలాంటి ఫలితం అందుకుంటుందో ఏదొక మ్యాజిక్ జరగాలని అనుకుంటున్నారు.. అయితే ఈ సినిమాని దర్శకుడు మోహన్ రాజా తెరకెక్కిస్తుండగా సల్మాన్ ఖాన్ కీలక పాత్ర చేస్తున్నారు. అలాగే నయనతార హీరోయిన్ గా నటిస్తుండగా థమన్ సంగీతం అందిస్తున్నాడు.