అన్న మాట తప్పిన రామ్ చరణ్

టాలీవుడ్ లో స్టార్ హీరోస్ లో రామ్ చరణ్ కూడా ఒకడు. రాజమౌళి RRR సినిమాతో పాన్ ఇండియా అప్పీల్ అందుకున్నాడు రామ్ చరణ్. ప్రస్తుతం శంకర్ దర్శకత్వంలో ఒక సినిమాలో నటిస్తున్న రామ్ చరణ్ ఒక మాట తప్పదని వార్త హల్చల్ చేస్తుంది.

‘సైరా’ సినిమా టైం లో తాను ఎప్పుడూ సినిమా కలెక్షన్స్ గురించి పోస్ట్ చెయ్యనని అన్నాడు. దీనికి చిరంజీవి, మీడియా కూడా హర్షం వ్యక్తం చేసింది. కట్ చేస్తే..ఇప్పుడు ‘గాడ్ ఫాదర్’ సినిమాకు అవన్నీ మరిచిపోయారు. ఫిగర్ల పోస్టర్లు మళ్లీ ప్రత్యక్షం అయ్యాయి.

టాలీవుడ్ లో పెద్ద అంకెల గ్రాస్ ఫిగర్లు ప్రకటించడం అలవాటు. దీనికి ఫేక్ ఫిగర్లు అంటూ యాంటీ ఫ్యాన్స్ వైపు నుంచి గొడవ వస్తున్నపుడు ఇక పోస్టర్లు వేసి ప్రయోజనం ఏమిటి అని అంతా అనుకుంటున్నపుడు రామ్ చరణ్ ఇలాంటి నిర్ణయం ప్రకటించడం జరిగింది.

నిజానికి ‘గాడ్ ఫాదర్’ హిట్ టాక్ తెచ్చుకున్నా కలెక్షన్స్ మాత్రం అంత గా లేవు.