Mega Acharya : ‘ఆచార్య’: టాలీవుడ్ బాక్సాఫీస్‌కి అసలు పరీక్ష

Mega Acharya : నిన్న మొన్నటి వరకూ ‘ఆర్ఆర్ఆర్’ మేనియాతో టాలీవుడ్ బాక్సాఫీసులు బద్దలైపోయాయ్. ఇప్పుడు ‘కేజీఎఫ్ ఛాప్టర్ 2’ వచ్చింది. స్ట్రెయిట్ తెలుగు సినిమా మాదిరి ఈ సినిమాకీ టాలీవుడ్‌లో భారీ వసూళ్లు వస్తున్నాయ్. లాభాల మీద లాభాలు ఆర్జిస్తున్నారు కేజీఎఫ్ సినిమాతో టాలీవుడ్ డిస్ర్టిబ్యూటర్లు.
అయితే, ఈ సినిమా విషయంలో ఈ మ్యాజిక్ ఎలా సాధ్యమైంది.? అనేది వేరే చర్చ. ఇక ఇప్పుడు ‘ఆచార్య’ సినిమా ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఇంకా ఓ వైపు ‘కేజీఎఫ్ ఛాప్టర్ 2’ పూనకాలు అలాగే వున్నాయ్. ఈ టైమ్‌లో ‘ఆచార్య’ రిలీజ్ సబబేనా.? అనే అనుమానాలు కొన్ని వర్డాలను కలవరపెడుతున్నాయ్.
అయితే, తెలుగు సినిమా తన సత్తా చాలా సార్లు ప్రూవ్ చేసుకుంది. మళ్లీ మళ్లీ ప్రూవ్ చేసుకోవడానికి ఎప్పుడూ సిద్ధంగానే వుంటుంది. ‘ఆచార్య’ సినిమా విషయానికి వస్తే, ఇద్దరు స్టార్ హీరోలు.. అందులోనూ తండ్రీ కొడుకులు కలిసి నటిస్తున్న సినిమా ఇది. ‘కేజీఎఫ్’ మేనియా ఎంతలా వున్నా, మన తెలుగు సినిమా లెక్కే వేరు.
‘ఆచార్య’ విషయంలో ఆ లెక్క వేరే లెవల్ కూడా. అయితే, కేజీఎఫ్‌ సినిమాకి ఈ రేంజ్‌లో రెస్పాన్స్ రావడం వెనుక రకరకాల కారణాలు వినిపిస్తున్నాయ్. అనూహ్య రీతిలో సక్సెస్ సాధించింది కానీ, అంతకు మించి ఓవరాక్షన్ నడిచింది ‘కేజీఎఫ్’ సినిమా విషయంలో. ఏది ఏమైతేనేం, ఈ మేనియా నుంచి తెలుగు సినిమా బయటపడాలంటే ‘ఆచార్య’ రావల్సిందే. సంచలన విజయం సాధించాల్సిందే. లెట్స్ వెయిట్ అండ్ సీ.!