Meera Jasmine: రీ ఎంట్రీ ఇస్తున్న పవన్ కళ్యాణ్ హీరోయిన్.. ఎవరో తెలుసా?

Meera Jasmine: తెలుగు సినీ ప్రేక్షకులకు హీరోయిన్ మీరాజాస్మిన్ గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. మొదట అమ్మాయి బాగుంది సినిమాతో తెలుగు సినీ ఇండస్ట్రీకి పరిచయం అయ్యింది. ఆ తరువాత తెలుగులో గుడుంబా శంకర్, భద్ర లాంటి సినిమాల్లో నటించి మంచి పాపులారిటీ సంపాదించుకుంది ఈ మలయాళ బ్యూటీ. అంతేకాకుండా తెలుగులో పందెంకోడి, గోరింటాకు, ఆకాశ రామన్న లాంటి సినిమాల్లో నటించి నటిగా తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు ఏర్పరుచుకుంది. ఇక తెలుగులో నటించదట కొన్ని సినిమాలే అయినప్పటికీ తనకంటూ ప్రత్యేకమైన ఇమేజ్ ను ఏర్పరుచుకుంది.

అంతే కాకుండా ఆమె నటించిన సినిమాలు అన్నీ కూడా మంచి గుర్తింపు తెచ్చిపెట్టాయి. కేవలం తెలుగులో మాత్రమే కాకుండా మలయాళంలో కూడా పలు సినిమాలలో నటించింది. ఇక నటిగా తనకు ఆశించిన స్థాయిలో విజయాలు లేకపోవడంతో సినీ ఇండస్ట్రీ బాయ్ బై చెబుతూ దుబాయ్ కి చెందిన సాఫ్ట్ వేర్ ఇంజనీర్ అనిల్ జాన్ టైటాన్ ని పెళ్లి చేసుకుంది. 2014లో పెళ్లి చేసుకొని వైవాహిక జీవితాన్ని మొదలుపెట్టిన ఆమె ఆ తర్వాత పలు మనస్పర్థల కారణంగా తన భర్త నుంచి విడిపోయింది. ఇది ఇలా ఉంటే మీరాజాస్మిన్ కు సంబంధించి ఒక వార్త ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

అదేమిటంటే మీరా జాస్మిన్ మళ్లీ ఇన్ని రోజుల తర్వాత సినిమాలు చేసేందుకు సిద్ధం అయ్యింది. ఆమె మళ్లీ సినిమాల్లోకి రీ ఎంట్రీ ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే మకల్ అని ఒక మలయాళ సినిమా తో రీ ఎంట్రీ ఇస్తోంది. ఇక అదే జోష్ తో టాలీవుడ్ కి కూడా రీ ఎంట్రీ ఇవ్వనున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. అయితే సినిమాలకు దూరంగా ఉన్నప్పటికీ ఈమె సోషల్ మీడియాలో మాత్రం బాగా యాక్టివ్ గా ఉంటుంది. నిత్యం తన అభిమానులతో ముచ్చటిస్తూ ఉంటుంది. ఇక ఇటీవలే ఆమె ఇంస్టాగ్రామ్ లోకి ఎంట్రీ ఇవ్వడంతో ఆమెకు ఫాలోవర్ ల సంఖ్య అమాంతం పెరిగిపోయింది. అంతేకాకుండా ఊహించని విధంగా ఆమె ఇంస్టాగ్రామ్ లోకి ఎంట్రీ ఇచ్చిన మొదటి రోజే దాదాపు లక్ష మంది ఆమెను ఫాలో అయ్యారు.