Pawan Kalyan: సినీ నటుడు జనసేన అధినేత ఆంధ్ర ప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పై టాలీవుడ్ హీరోయిన్ ప్రశంసల వర్షం కురిపించారు. ఇటీవల పిఠాపురంలో జనసేన పార్టీ ఆవిర్భావ వేడుకలను నిర్వహించిన సంగతి తెలిసిందే. ఈ కార్యక్రమంలో భాగంగా పవన్ కళ్యాణ్ తమిళనాడు ప్రభుత్వం పై తీవ్ర స్థాయిలో విమర్శలు కురిపించారు ముఖ్యంగా హిందీ భాష గురించి ఈయన చేసిన వ్యాఖ్యలు సంచలనంగా మారాయి.
ఈ క్రమంలోనే పవన్ వ్యాఖ్యలపై తమిళ రాజకీయాలలో పెద్ద దుమారం రేపుతుంది అంతే కాకుండా ఎంతో మంది తమిళ ప్రజలు పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలపై తీవ్ర స్థాయిలో విమర్శలు కురిపిస్తున్నారు. హిందీ భాష మాత్రం వద్దు.. తమిళ లు మాత్రం హిందీలో డబ్ చేస్తారు.. అక్కడి డబ్బులు మాత్రం మీకు కావాలి.. అక్కడి భాష మాత్రం మీకు వద్దా?’ అంటూ తమిళ నాడు ప్రభుత్వాన్ని ప్రశ్నించారు.
ఇలా పవన్ కళ్యాణ్ చేసిన ఈ వ్యాఖ్యల పట్ల కొంతమంది సమర్పించగా, మరికొందరు మాత్రం పూర్తిస్థాయిలో వ్యతిరేకిస్తున్నారు. ఈ క్రమంలోనే నటి మీరా చోప్రా పవన్ కళ్యాణ్ గురించి సోషల్ మీడియా వేదికగా చేసిన ఒక ట్వీట్ ప్రస్తుతం వైరల్ అవుతుంది. పవన్ కళ్యాణ్ దమ్మున్న నాయకుడని ప్రశంసించింది. కేవలం గట్స్ మాత్రమే కాదు.. తెలివి, బుద్ది, జ్ఞానం ఉన్న నాయకుడు అంటూ పవన్ పై తెగ ప్రశంసలు కురిపించారు.
ఇలా పవన్ కళ్యాణ్ గురించి నటి మీరా చోప్రా చేసిన ఈ వ్యాఖ్యలు ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి. అయితే ఈమె ఇది వరకే పవన్ కళ్యాణ్ తో కలిసి బంగారం అనే సినిమాలో నటించారు. తద్వారా పవన్ కళ్యాణ్ వ్యక్తిత్వం గురించి దగ్గరగా చూసిన నటి కావడంతో పవన్ పై ప్రశంసలు కురిపిస్తూ ఇలా పోస్ట్ చేశారు.