Home News పుష్ప' రెండు భాగాలు.. అంత సీన్ లేదక్కడ

పుష్ప’ రెండు భాగాలు.. అంత సీన్ లేదక్కడ

Meaningless Rumours On Allu Arjun'S Pushpa

సుకుమార్ దర్శత్వంలో అల్లు అర్జున్ చేస్తున్న చిత్రం ‘పుష్ప’. భారీ వ్యయంతో రూపొందుతున్న ఈ సినిమాను పాన్ ఇండియా లెవల్లో తెరకెక్కిస్తున్నారు. తెలుగుతో పాటు ఇంకో నాలుగైదు భాషల్లో రిలీజ్ చేయాలని ప్లాన్ చేశారు. ఒక్క మాటలో చెప్పాలంటే ఈ సినిమాతో బన్నీ పాన్ ఇండియా స్టార్ అయిపోవాలి. అందుకే ఎక్కడా కాంప్రమైజ్ కాకుండా తెరకెక్కిస్తున్నారు. కానీ కరోనా అడుగడుగునా అడ్డుపడుతోంది. ఈప్పటికే పూర్తికావాల్సిన సినిమా పలుమార్లు వాయిదాపడింది. అల్లు అర్జున్ సైతం కరోనాకు గురయ్యారు. ఆయన సెట్స్ మీదకు వెళ్ళడానికి ఇంకో నెల రోజులు పట్టేలా ఉంది.

ఇదిలా అనగా తాజాగా సినిమా గురించి కొత్త రూమర్స్ మొదలయ్యాయి. అదేమిటంటే ఈ సినిమాను రెండు భాగాలుగా చేసి వదలాలని అనుకుంటున్నారట మేకర్స్. షూటింగ్ అనుకున్న సమయానికి కంప్లీట్ అయ్యేలా లేకపోవడంతో ముందు అయినంత వరకు మొదటి భాగంగా వదలాలని ఆ తర్వాత తాపీగా షూటింగ్ చేసి సెకండ్ పార్ట్ వదలాలని భావిస్తున్నారట. అయితే ఆ వార్తలను అంత ఈజీగా నమ్మలేం. ఎందుకంటే సుకుమార్ రాసుకున్నది రెండున్నర గంటల సినిమాకు సరిపడా కథే. నిర్మాతలు డబ్బులు పెడతామన్నది కూడ దానికే. షూటింగ్ జరిగింది కూడ సింగిల్ ఇన్స్టాల్మెంట్ సినిమాకే. అలాంటిది ఇప్పుడు అవుట్ ఫుట్ ను రెండు భాగాలు చేయడం అనేది దాదాపు అసాధ్యం. కాబట్టి ఈ పుకార్లను నమ్మాల్సిన అవసరం లేదు.

 

Related Posts

‘పెళ్లి సందడి’ భామకి అప్పుడే అంత క్రేజ్.?

'పెళ్లిసందడి' సినిమా అప్పట్లో ఓ పెద్ద సంచలనం. దర్శక రత్న రాఘవేంద్రరావు రూపొందించిన ఈ అద్భుత ప్రేమ కావ్యంలో శ్రీకాంత్, రవళి, దీప్తి భట్నాగర్ నటించిన సంగతి తెలిసిందే. ఇన్నేళ్ల తర్వాత మళ్లీ...

Related Posts

ఈ పాప రేటు చాలా ‘హాటు’

'బేబమ్మ'గా తొలి సినిమా 'ఉప్పెన'తో విపరీతమైన క్రేజ్ సంపాదించుకున్న ముద్దుగుమ్మ కృతిశెట్టి. తొలి సినిమా అనూహ్యమైన విజయం సాధించడంతో బేబమ్మను వరుస పెట్టి అవకాశాలు వరిస్తున్నాయి. ప్రస్తుతం కృతిశెట్టి చేతిలో నాలుగు సినిమాలకు...

Latest News