నటీనటులు: మహేష్ దత్తా, సోని శ్రీవాస్తవ, శ్రీహరి ఉదయగిరి, సంజయ్ రాయ్ మరియు ఇతరులు
దర్శకత్వం : సుకు పూర్వజ్
నిర్మాతలు: వాసుదేవ్ రాజపంతుల, ప్రభాకర్ డి
సంగీత దర్శకుడు: అషీర్ ల్యూక్
సినిమాటోగ్రఫీ: శివరామ్ చరణ్
ఎడిటర్: శివ సర్వాణి
పెద్ద పెద్ద సినిమాలకే జనాలు థియేటర్స్ రావట్లేదు. అయినా సరే ధైర్యం చేసి చిన్న సినిమాలను థియేటర్ లో రిలీజ్ చేస్తున్నారు ప్రొడ్యూసర్స్. లేటెస్ట్ గా ఈ వారం థియేటర్స్ లోకి వచ్చిన చిత్రాల్లో మహేష్ దత్త, సోని శ్రీవాస్తవ అలాగే శ్రీహరి ఉదయగిరి నటించిన చిత్రం “మాట రాని మౌనమిది” కూడా ఒకటి. ఈ సినిమా ఎలా ఉందో చూద్దాం.
కథ :
రామ్(మహేష్ దత్త) అలాగే ఈశ్వర్(సంజయ్ రాయి) లు ఇద్దరూ వరసకు కూడా బావ బావమరుదులు అవుతారు. ఈశ్వర్, రామ్ సోదరిని పెళ్లి చేసుకుంటాడు. ఓ రోజు రామ్, ఈశ్వర్ ఇంటికి ఓ పని మీద వస్తాడు. అప్పుడు అక్కడ అతడికి ఓ ఉంగరం దొరుకుతుంది. అయితే ఆ ఉంగరం కేవలం సాధారణ ఉంగరం కాదు, దానితో కొన్ని శక్తులు ఉన్నట్టుగా రామ్ తెలుసుకుంటాడు. మరి ఈ విషయం ఈశ్వర్ కి కూడా ఈ విషయం తెలుస్తుందా? తెలిస్తే ఏం చేస్తారు? ఈ తర్వాత రామ్ కి ఎదురైనా అవాంతరాలు ఏమిటి వీటికి హీరోయిన్ సీత(సోనీ శ్రీవాస్తవ)కి ఏమన్నా లింక్ ఉంటుందా? ఇంతకీ ఆ ఉంగరం వెనక ఉన్న స్టోరీ ఏంటి అనేది తెలియాలి అంటే ఈ సినిమా చూసి తెలుసుకోవలసిందే.
ప్లస్ పాయింట్స్ :
ఇలాంటి కాన్సెప్ట్ ఉన్న సినిమాలు ఎప్పుడూ ఆడియెన్స్ లో మంచి ఆసక్తి రేపుతాయి. అయితే వాటికి తగ్గట్టుగానే డైరెక్టర్ సినిమాలో లైన్ సహా నరేషన్ స్టార్టింగ్ నుంచి బాగానే ఎగ్జిక్యూట్ చేసాడు. అలాగే సినిమాలో రివీల్ అయ్యే ట్విస్ట్ ఇంటర్వల్ వరకు కొనసాగే సస్పెన్స్ కూడా చాలా ఇంటరెస్టింగ్ గా కొనసాగుతుంది.
మహేష్ దత్త డీసెంట్ నటనతో ఆకట్టుకుంటాడు. అలాగే సోని శ్రీవాస్తవ ఇతర నటీనటులు కూడా తమ పాత్రల్లో మంచి పెర్ఫామెన్స్ తో మెప్పిస్తారు. శ్రీహరి ఉదయగిరి అని చెప్పుకోవాలి. ఈ మూవీ సెకండాఫ్ లో వచ్చే కొన్ని ఇంట్రెస్టింగ్ సీన్స్ అలాగే కొన్ని చోట్ల కామెడీ కూడా బాగుంది.
మైనస్ పాయింట్స్ :
ఈ సినిమాలో మంచి లైన్ కనిపిస్తుంది కానీ కొన్ని చోట్ల బాగానే అనిపిస్తుంది కానీ ఓవరాల్ గా మాత్రం కథనం అంత ఆకట్టుకునే రేంజ్ లో ఉన్నట్టు అనిపించదు. స్లో నరేషన్ వాళ్ళ కొంత బోరింగ్ గా ఉంటుంది.
తీర్పు :
ఈ “మాట రాని మౌనమిది” సినిమాలో నటీనటుల డీసెంట్ పెర్ఫామెన్స్ ఇచ్చారు. అలాగే సినిమాలో కనిపించే లైన్ సహా పలు అంశాలు థ్రిల్ చేస్తాయి. కొన్ని వీక్ పాయింట్స్ వున్న…ఈ సినిమా ఒక్కసారి చూడొచ్చు.