‘మాటరాని మౌనమిది’ మూవీ ఎలావుందంటే..

మహేష్ దత్తా, సోని శ్రీవాస్తవ, శ్రీహరి ఉదయగిరి ప్రధాన పాత్రలు పోషించిన ‘మాటరాని మౌనమిది’ నేడు (శుక్రవారం ఆగస్ట్ 19) థియేటర్లలో విడుదలైంది. ఈ చిత్రానికి సంబంధించి విడుదలకు ముందే వచ్చిన ట్రైలర్, పాటలు టీజర్‌ ప్రేక్షకుల్లో ఆసక్తిని కలిగించాయి. సినిమా కోసం ఎదురుచూసేలా చేశాయి. మరి ఈ సినిమా ఎలా ఉందో తెలుసుకోవాలంటే రివ్యూలోకి వెళ్లాల్సిందే…

కథలోకి వెళదాం…
చాలా రోజులు తర్వాత రామ్ (మహేష్ దత్తా) తన బావ (ఈశ్వర్) ఇంటికి వస్తాడు. తను మిస్సవుతున్నది తన చెల్లెలిని మాత్రమే. ఈశ్వర్‌కి రామ్‌ని చూసినందుకు సంతోషం కలిగింది, వారు కలిసి జీవిత గడపాలని నిర్ణయించుకుంటారు. ఓ మంచి రోజు, ఈశ్వర్ ఏదో పని మీద బయటకు వెళ్లి, రామ్‌ని తలుపు లాక్ చేసి సురక్షితంగా ఉండమని చెబుతాడు. రామ్ ఒంటరిగా ఇంట్లో ఏదో పని చేస్తూ ఉండగా, డోర్ బెల్ మోగుతుంది. బెల్ కొట్టిన మిస్టరీ వ్యక్తి ఎవరో తెలుసుకోవాలంటే, కాలింగ్ బెల్ కొట్టడానికి రామ్ ఎందుకు భయపడుతున్నాడు, ఇంట్లో ఏముంది? లాంటి ప్రశ్నలకు సమాధానం కావాలంటే ‘మాటరాని మౌనమిది’ చిత్రం థియేటర్ కి వెళ్లి చూడాల్సిందే…

విశ్లేషణలోకి వెళదాం…
సినిమా ఆద్యంతం ఆసక్తికరంగా సాగుతూ ప్రేక్షకుడిని ఆలోచింపజేస్తుంది. దర్శకుడి టేకింగ్.. ఫ్రేమ్ బై ఫ్రేమ్ వచ్చే సన్నివేశాలు ముచ్చటగొలుపుతాయి. సినిమా చూస్తున్నంత సేపు హాయిగా అనిపిస్తుంది. కథను మలచిన తీరు, కథనం సాగుతున్నతీరు ప్రేక్షకుడిని ఊహల్లో విహరింపజేస్తుంది. ఆసక్తి, ఆలోచనతో వినోదాన్ని పంచుతుంది. క్లైమాక్స్‌లో ముగింపు సర్‌ప్రైజింగ్‌గా ఉంటుంది.

నటీనటుల పనితీరు ఎలావుందంటే..
ఈ ‘మాటరాని మౌనమిది’ చిత్రంలో ప్రధానంగా చెప్పుకోవాలసింది ఇద్దరు నటుల గురించి. వాళ్ళు ఎవరంటే.. మహేష్ దత్తా- శ్రీహరి ఉదయగిరి. వీళ్ళిద్దరూ ఎవరికివారే సాటిలా నటించి మెప్పించారు. నటనలో రాటుదేలేలా కనిపించి పాత్రల్లో పరకాయ ప్రవేశం చేశారని చెప్పొచ్చు. అంతేకాదు.. ఇద్దరు పోటీపడి నటించారు , ఆస్వాదించేంత బాగుంది. ఆయా పాత్రల్లో ఇద్దరూ ఒదిగిపోయారు. తెరపై హుషారుగా సందడి చేస్తూ నటనలో మెళకువలు పండిస్తూ హుందాగా కనిపిస్తూ.. తమదైన మాటతీరు, యాక్టింగ్ తో ఇరగదీశారు. ఆయా పాత్రలకు వీళ్ళే ఫర్‌ఫెక్ట్‌ చాయిస్‌ అనేలా నటించారు. ఎమోషనల్‌ సీన్స్‌లో కూడా తమదైన ప్రతిభను కనబరిచారు. తమదైన నటనతో ఆకట్టుకుంటూ వారి పాత్రలు తొలి నుంచి చూపిస్తూ.. ప్రేక్షకులకు క్యూరియాసిటీ పెంచారు. ఇక హీరోయిన్ పాత్రకు సోని శ్రీవాస్తవ తన కిల్లర్ పెర్ఫార్మెన్స్‌తో షోని స్టెప్పులేసింది.ఆ పాత్రకు ఆమె పూర్తి న్యాయం చేసింది. తెరపై బ్యూటిఫుల్‌గా కనిపించింది. ఎమోషనల్‌ సీన్స్‌లో కూడా చక్కగా నటించింది. అన్ని షేడ్స్ లో తనదైన హావభావాలతో మెప్పించి నటనలో ప్రతిభ ఉన్న అమ్మాయిగా అదరగొట్టేసింది.ఇతర పాత్రల్లో కనిపించిన చందు, సంజీవ్, అర్చన అనంత్, కేశవ్, సుమన్ శెట్టి తదితరులు తమ పాత్రల పరిధి మేరకు నటించి తమవంతు పాత్రని సమర్ధవంతంగా పోషించారు.

ప్లస్ పాయింట్స్ గురించి తెలుసుకుంధాం..
దర్శకుడు సుకుపువ్‌రాజ్ మంచి కాన్సెప్ట్‌తో ఈ సినిమాని తెరకెక్కించి ఆద్యంతం రక్తికట్టేలా చేశాడు. కచ్చితంగా ఈ సినిమా ప్రేక్షకులను మెప్పిస్తుంది. సినిమాలోని సస్పెన్స్ ప్రేక్షకులను తమ స్క్రీన్‌లకు అతుక్కుపోయేలా చేస్తుంది. ఈ సినిమాకు మరో ప్రధాన బలం సంగీతం. అలాగే నేపథ్య సంగీతం కూడా భేష్..అనిపిస్తుంది. బీజీఎంతో విజువల్స్ స్థాయిని పెంచడమే కాదు.. ఎమోషనల్ గా కనెక్ట్ అయ్యేలా చేస్తుంది. సంగీతం, బ్యాక్ గ్రౌండ్ స్కోర్ వేటికవే సాటిలా అనిపించాయి. ప్రతీ సన్నివేశం ఆసక్తిగా సాగుతూ ప్రేక్షకుడిని కట్టిపడేలా చేస్తుంది. సినిమాటోగ్రాఫర్ పనితీరు అద్భుతంగా ఉంది. ప్రతి ఫ్రేమ్‌ని తెరపై అందంగా చూపించాడు. అద్భుతమైన విజువల్స్‌ని అందించి ప్రేక్షకులను కథలో లీనమయ్యేలా చేశాడు. ఎడిటింగ్‌ పర్వాలేదు. సినిమా విజువల్ రిచ్‌గా ఉండేలా చూసుకోవడంలో నిర్మాతలు ఎక్కడా రాజి పడకుండా ఖర్చుపెట్టారు. నిర్మాణం విషయంలో వారు కనబరిచిన శ్రద్ద సినిమా తెరపై వండర్ లా కనిపిస్తుంది. నిర్మాణ విలువలు సినిమా స్థాయికి తగినట్లుగానే ఉన్నాయి.

మైనస్ పాయింట్స్ గురించి తెలుసుకుంధాం..
ఈ సినిమా ద్వితీయార్ధంలో కొద్దిగా ల్యాగ్‌ ఉంది. కొత్త నటీనటులు కావడంతో సినిమాపై ప్రేక్షకుల్లో ఆసక్తి పెరగడానికి కొంత సమయం పడుతుంది. అయితే.. ప్రేక్షకులు సినిమాను ఆస్వాదించడం ప్రారంభించిన తర్వాత, ఎలాంటి తేడా అనిపించదు.హాయిగానే మనస్సు తేలికపడుతుంది. సినిమాని ఎంజాయ్ చేసేలా చేస్తుంది. ప్రధానంగా హారర్ చిత్రాలను ఇష్టపడే ప్రేక్షకులు ఈ ‘మాటరాని మౌనమిది’ని ఖచ్చితంగా బాగా ఇష్టపడతారనడంలో ఎలాంటి సందేహం లేదు. సో.. హాయిగా మీరూ ఓ సారి ఈ ‘మాటరాని మౌనమిది’ ప్రదర్శిస్తున్న థియేటర్లలోకి అడుగుపెట్టి సినిమాని ఎంజాయ్ చేయండి.
రేటింగ్ :3/5