మాస్ అప్డేట్ : “NBK107” టైటిల్ ఎప్పుడు వచ్చేస్తుంది అంటే.!

తెలుగు సినిమా దగ్గర బిగ్గెస్ట్ మాస్ హీరోస్ లో ఒకరైన నందమూరి నటసింహ నందమూరి బాలకృష్ణ హీరోగా గ్లామరస్ బ్యూటీ శృతి హాసన్ హీరోయిన్ గా నటిస్తున్న చిత్రం కూడా ఒకటి. అయితే ఈ చిత్రం “NBK107” గా తెరకెక్కిస్తున్న ఈ చిత్రాన్ని దర్శకుడు గోపీచంద్ మలినేని తీస్తున్నాడు.

మరి ఈ సినిమా విషయంలో ఎప్పుడు నుంచో అభిమానులు టైటిల్ ఏంటి అనే అంశం కోసం చాలా ఎగ్జైటింగ్ గా ఉన్నారు. కానీ ఫైనల్ గా అయితే ఈ అప్డేట్ పై మాస్ న్యూస్ ని చిత్ర నిర్మాణ సంస్థ మైత్రి మూవీ మేకర్స్ వారు ఇప్పుడు అప్డేట్ ఇచ్చేసారు.

ఈ చిత్రం మాస్ యుఫొరియా టైటిల్ ని ఈ అక్టోబర్ 21నే అనౌన్స్ చేస్తున్నట్టుగా ఫైనల్ గా ఈ అప్డేట్ ని అందించారు. ఇప్పటికీ వీర సింహా రెడ్డి, అన్నగారు, రెడ్డి గారు లాంటి పవర్ ఫుల్ టైటిల్స్ పరిగణలో ఉన్నాయి మరి బాలయ్య అయితే ఏ టైటిల్ లో వస్తారో వేచి చూడాలి.

ఇంకా ఈ సినిమాకి థమన్ సంగీతం అందిస్తుండగా దునియా విజయ్ వర లక్ష్మి శరత్ కుమార్ తదితరులు కీలక పాత్రల్లో నటిస్తున్నారు. అలాగే వచ్చే ఏడాది అయితే ఈ చిత్రం రిలీజ్ కానుంది. 
shttps://twitter.com/MythriOfficial/status/1581523358940028928?s=20&t=iT6YvHkr4LfWOuAycUmW6A