ఈరోజే మంచి ముహూర్తం..పట్టాలెక్కిన స్టార్ హీరోల సినిమాలు

Many star heros movies started today
Many star heros movies started today
 
లాక్ డౌన్ సడలింపులు రావడంతో స్టార్ హీరోలు ఒక్కొక్కరు సెట్స్ మీదకు వస్తున్నారు. ఈ ఒక్కరోజే పలువురు స్టార్ హీరోల సినిమాలు రీస్టార్ట్ అవ్వడం జరిగింది. విక్టరీ వెంకటేష్, వరుణ్ తేజ్ హీరోలుగా అనిల్ రావిపూడి చేస్తున్న ‘ఎఫ్ 3’ సినిమా హైదరాబాద్లో రీస్టార్ట్ అయింది.  ఈ షెడ్యూల్ 10 రోజులపాటు జరగనుంది.  ఇక మాస్ మహరాజ రవితేజ అయితే ఏకంగా కొత్త సినిమానే లాంఛ్ చేశారు ఈరోజు. శరత్ మండవ దర్శకత్వంలో ఆయన సైన్ చేసిన నూతన చిత్రం ఈరోజే హైదరాబాద్లో పూజా కార్యక్రమాలతో మొదలైంది.  రవితేజ హిట్ ట్రాక్ మీద ఉండటంతో ఈ సినిమా మీద కూడ అంచనాలు బాగున్నాయి.  రవితేజ మరొక సినిమా ‘ఖిలాడి’ సైతం త్వరలో రీస్టార్ట్ కానుంది.  
 
ఇక తమిళ హీరో విజయ్ చేస్తున్న ‘బీస్ట్’ చిత్రం చెన్నైలో తిరిగి మొదలైంది. పూజా హెగ్డే, విజయ్ మీద ఒక సాంగ్ కంపోజ్ చేస్తున్నారు.  ఇది పూర్తయ్యాక వంశీ పైడిపల్లి చిత్రాన్ని మొదలుపెడతారు విజయ్.  ఇక సుధీర్ బాబు, కృతి శెట్టి కలిసి నటిస్తున్న ‘ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి’ సినిమా కూడ ఈరోజు హైదరాబాద్లో మొదలైంది.  ఈ చిత్రాన్ని మోహన్ కృష్ణ ఇంద్రగంటి డైరెక్ట్ చేస్తున్నారు.  ఇవే కాదు ఇంకొన్ని చిన్న చిత్రాలు ఈరోజే షూటింగ్ ప్రారంభించుకుంటున్నాయి.  ఇక మెగాస్టార్ చిరంజీవి, పవన్ కళ్యాణ్, అల్లు అర్జున్, మహేష్ బాబు, ప్రభాస్ లాంటి స్టార్ హీరోలందరూ ఈ జూలై నెలలోనే తమ సినిమాలను రీస్టార్ట్ చేయనున్నారు.