Manchu Manoj: శివయ్యా…. నన్ను క్షమించండి….కన్నప్ప టీంకు మంచు మనోజ్ క్షమాపణలు!

Manchu Manoj: మంచు మనోజ్ త్వరలోనే భైరవం అనే సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధంగా ఉన్నారు. ఈ సినిమా మే 30వ తేదీ విడుదల కాబోతున్న నేపథ్యంలో పెద్ద ఎత్తున ప్రమోషన్ కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు. ఇక ఈ సినిమాలో మంచు మనోజ్ తో పాటు నారా రోహిత్, బెల్లంకొండ శ్రీనివాస్ నటిస్తున్న విషయం తెలిసిందే. ఇక ఈ సినిమా ప్రమోషన్ కార్యక్రమాలలో భాగంగా మంచు మనోజ్ తన అన్నయ్య మంచు విష్ణు కన్నప్ప సినిమా టీంకు క్షమాపణలు చెప్పారు.

ఈ సందర్భంగా మంచు మనోజ్ మాట్లాడుతూ నేనెప్పుడూ ఎవరికి ఎలాంటి అన్యాయం చేయలేదు కానీ నన్ను మాత్రం తొక్కేయాలని చాలా చూశారు. ఈ విషయాల గురించి నేను మొదట్లో పట్టించుకోలేదు కానీ, ఆ తరువాత చాలా బాదేసిందని తెలిపారు.నన్ను విష్ణు వ్యక్తిగతంగా బాధపెట్టాలని చూశాడు. నా బట్టలు, కార్లు అన్నీ ధ్వంసం చేయించాడు. పోనీలే అనుకున్నాను. కానీ నా భార్య వాళ్ల అమ్మ, నాన్న జ్ఞాపలను దాచుకుంటే వాటిని కూడా ధ్వంసం చేయించడంతో చాలా బాధేసింది అందుకే కన్నప్ప సినిమా గురించి మాట్లాడాల్సి వచ్చిందని తెలిపారు.

నా మనసులో ఉన్నది చాలా సార్లు మీడియా ముందే చెప్పుకున్నాను. శివయ్యా అంటూ మొన్న ఈవెంట్ లో కన్నప్ప గురించి అన్నాను. ఆ తర్వాత అనకుండా ఉండాల్సింది అని చాలా బాధపడ్డానని తెలిపారు. ఈ సినిమాలో మోహన్ లాల్, ప్రభాస్,కాజల్, అక్షయ్ కుమార్ లాంటి వాళ్లు స్టార్లు నటించారు. ఎంతో మంది కష్టపడ్డారు. నేను మాట్లాడిన మాటలు కారణంగా వీరి అభిమానులు ఎంతో బాధపడి ఉంటారని నేను అనుకున్నాను. ఇలా ఒకడి వల్ల ఇంత మంది కష్టం వృధా కాకూడదని అందుకే నా మాటల వల్ల ఎవరైనా బాధపడి ఉంటే నన్ను క్షమించండి అంటూ కన్నప్ప టీంకు మంచు మనోజ్ బహిరంగంగా క్షమాపణలు తెలియజేశారు.