ఆహా..పవన్ ఫ్యాన్స్ ని కాకా పడుతున్న మంచు విష్ణు.!

తాజాగా జరిగినటువంటి “మా” ఎన్నికల్లో మంచు వారి అబ్బాయి మంచు విష్ణు ఊహించని విధంగా గెలుపొంది నిన్ననే తన ప్రమాణ స్వీకారం కూడా పూర్తి చేసుకున్న సంగతి అందరికీ తెలిసిందే. అయితే మంచు విష్ణు గెలుపు సక్రమం కాదని ఇప్పటికీ ప్రకాష్ రాజ్ మరియు అతని సానుభూతిపరులు అంటున్న బలమైన మాట. అయితే కొన్ని విషయాలు ఓపెన్ గా మాట్లాడుకున్నట్టయితే క్లియర్ గా మంచు అండ్ మెగా ఫ్యామిలీ కి ఒక లైన్ అయితే ఈ మధ్య బాగా కనిపించింది.

పలు కోణాల్లో మంచు వారికి చిరు కి కాస్త వేడి వాతావరణమే నమోదు కాగా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ విషయంలో కూడా మంచు వారి తీరు కాస్త అనుమానతరంగానే అందరికీ అనిపించింది. ఒక్క మంచు మనోజ్ తప్పితే మిగతా వారి మీద డౌట్ లోనే అంతా ఉండగా ఈ నెగిటివిటీ మీదో ఏమో కానీ ఇప్పుడు విష్ణు తన ట్విట్టర్ ద్వారా ఒక వీడియో పెట్టి ఇందులో చివరగా కనిపించింది ఎవరో గెస్ చెయ్యండి అని పెట్టాడు.

అయితే అందులో మాస్క్ తో ఉన్న పవన్ కళ్యాణ్ నే అని అందరికీ క్లియర్ గా అర్ధం అవుతుంది. కానీ ఇంత సడెన్ గా విష్ణు నుంచి ఈ ట్వీట్ పడటానికి కారణం ఏమిటా అన్న అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. అయితే ఇదంతా చూస్తుంటే కేవలం పవన్ అభిమానులను కాకా పట్టడానికే అన్నట్టు మాత్రం క్లియర్ గా అర్ధం అవుతుంది.