Vishnu–Manoj: టాలీవుడ్ హీరో మంచు విష్ణు నటించిన లేటెస్ట్ మూవీ కన్నప్ప. ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించిన ఎన్నో రకాల వార్తలు సోషల్ మీడియాలో వినిపించిన విషయం తెలిసిందే. ఈ సినిమా కోసం ఎంతో ఎక్సైటింగ్ గా ఎదురు చూస్తున్నారు అభిమానులు. ఈ సినిమాలో మంచు విష్ణువుతో పాటుగా ప్రభాస్, మోహన్ లాల్, అక్షయ్ కుమార్, కాజల్ లాంటి స్టార్స్ నటించడంతో ఈ సినిమాపై అంచనాలు భారీగా పెరిగాయి. ఇకపోతే ఈ సినిమా జూన్ 27న విడుదల కాబోతున్న విషయం తెలిసిందే. ఇలాంటి సమయంలో ఇటీవల కన్నప్ప సినిమాకు సంబంధించిన హార్డ్ డిస్క్ పోయింది అంటూ మంచు విష్ణు పోలీసులకు ఇచ్చిన కంప్లైంట్ తెలుగు సినిమా ఇండస్ట్రీలో సంచలనం రేపింది.
మంచు మనోజ్ తరపు మనుషులే ముంబై నుంచి VFX వర్క్ చేసిన కన్నప్ప సినిమాకు సంబంధించిన హార్డ్ డిస్క్ ని తీసుకున్నారని విష్ణు ఆరోపిస్తున్నాడు. ఆ హార్డ్ డిస్క్ లో ప్రభాస్ సీన్స్,తన సీన్స్ కలిపి ఒక అరగంట కంటెంట్ ఉంటుందని తెలిపారు. దీంతో గత కొన్ని రోజులుగా కన్నప్ప హార్డ్ డిస్క్ అంశం వైరల్ గా మారి కంటెంట్ ఉన్న హార్డ్ డిస్క్ పోతే కన్నప్ప సినిమా రిలీజ్ అవుతుందా లేదా అనే ప్రశ్న నెలకొంది. అయితే ఇదే విషయం గురించి తాజాగా ఒక ఇంటర్వ్యూలో స్పందించారు హీరో మంచు విష్ణు. ఈ సందర్భంగా హీరో మంచు విష్ణు మాట్లాడుతూ.. కన్నప్ప సినిమాకు 8 కంపెనీలు VFX చేస్తున్నాయి. బాంబేలో ఒక కంపెనీ వర్క్ చేసి ఇక్కడ హైదరాబాద్ లో DI కంపెనీకి పంపిస్తే ఏదో టెక్నికల్ ఇష్యూ వచ్చిందని సెకండ్ టైం మళ్ళీ చేసి ఆ కంటెంట్ వాళ్ళ దగ్గర ఒక కాపీ పెట్టుకొని, ఆది వెరిఫికేషన్ కి మాకు ఒక హార్డ్ డ్రైవ్ లో పాస్ వర్డ్ ప్రొటెక్షన్ పెట్టి పంపించారు.
మేము అలా పంపించమని అడగలేదు, వాళ్ళే పంపించారు. మాకు ఏ కొరియర్ వచ్చినా నాన్న గారి అడ్రెస్ కే వెళ్తుంది. అక్కడి నుంచి మేము తీసుకుంటాము. ఆ కొరియర్ వచ్చినప్పుడు అక్కడ రఘు అనే వ్యక్తి ఇలా కొరియర్ వచ్చింది అని చరిత అనే అమ్మాయికి ఫోన్ చేస్తే మా నిర్మాణ సంస్థ పేరు ఉంది అని తీసుకోమందట. అది తీసుకొని ఇద్దరూ వెళ్లిపోయారు. ఈ విషయం మాకు తెలియడంతో కంపెనీ రిప్రజెంటివ్ లేకుండా మీరు ఎలా ఇచ్చారు అని కొరియర్ కంపెనిని ప్రశ్నించాము. బాంబే VFX కంపెనీ వాళ్ళు కూడా పంపిస్తున్నట్టు మాకు చెప్పలేదు చెప్తే మేము ఫాలోఅప్ చేసేవాళ్ళం. తర్వాత రఘు, చరిత అనే వీరిద్దరూ మనోజ్ గారితో ఉంటారని తెలిసింది. ఫస్ట్ హార్డ్ డిస్క్ ఇమ్మని మధ్యవర్తులతో మనోజ్ తో మాట్లాడించాం అయినా ఇవ్వలేదు. దీంతో పోలీస్ కంప్లైంట్ ఇచ్చాము. ఇంకా హార్డ్ డిస్క్ మా చేతికి రాలేదు. వాళ్ళు అందులో కంటెంట్ లీక్ చేయకపోతే హ్యాపీ. జూన్ 20 కల్లా ఫస్ట్ కాపీ రెడీ అయిపోతుంది, జూన్ 27 సినిమా అన్ని భాషల్లో రిలీజ్ అవుతుంది అని తెలిపారు. ఈ సందర్భంగా మంచు విష్ణు చేసిన వ్యాఖ్యలు వైరల్ గా మారాయి.