‎Manchu Manoj: వారి బాధలు చాలా దగ్గరగా చూశా: మంచు మనోజ్‌

Manchu Manoj: టాలీవుడ్ హీరో మంచు మనోజ్ గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. మనోజ్ తెలుగులో నటించినది తక్కువ సినిమాలే అయినప్పటికీ హీరోగా తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపును ఏర్పరచుకున్నారు. కాగా మంచు మనోజ్ చివరగా ఇటీవలే భైరవం సినిమాతో ప్రేక్షకులను పలకరించిన విషయం తెలిసిందే. ఈ సినిమా భారీ అంచనాల నడుమ విడుదలై సూపర్ హిట్ గా నిలిచింది.

‎ఇది ఇలా ఉంటే తాజాగా హీరో మంచు మనోజ్ చేసిన వాఖ్యలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. కోలీవుడ్‌ సినిమా షూటింగ్‌ లో స్టంట్‌ మ్యాన్ రాజు మృతిపై టాలీవుడ్ హీరో మంచు మనోజ్ విచారం వ్యక్తం చేశారు. వెట్టువం మూవీ సెట్‌లో స్టంట్ లెజెండ్ ఎస్.ఎం.రాజు మరణించిన విషయం నాకు ఇప్పుడే తెలిసింది. స్టంట్‌మ్యాన్‌ కుటుంబానికి మద్దతుగా ఉంటానని ఇలాంంటి విషాద సమయంలో మన పరిశ్రమలోని ప్రతి ఒక్కరూ అండగా నిలబడాలని కోరుతున్నానంటూ పోస్ట్ చేశారు.

https://twitter.com/HeroManoj1/status/1944767386906681611?ref_src=twsrc%5Etfw%7Ctwcamp%5Etweetembed%7Ctwterm%5E1944767386906681611%7Ctwgr%5Ecd384e8bfa1ba30743d2c22a5371364d762c0dfb%7Ctwcon%5Es1_&ref_url=https%3A%2F%2Fwww.sakshi.com%2Ftelugu-news%2Fmovies%2Fmanchu-manoj-tweet-stunt-man-demise-movie-set-2505291

‎ఈ సందర్బంగా మంచు మనోజ్ తన ట్వీట్‌ లో రాస్తూ.. మూవీ సెట్‌ లో స్టంట్ లెజెండ్ ఎస్.ఎం.రాజు విషాదకరంగా మరణించిన విషయం నాకు ఇప్పుడే తెలిసింది. ఆయన కుటుంబానికి నా ప్రగాఢ సానుభూతి. గాయాలు జరిగినప్పుడు, ప్రాణాలు పోయినప్పుడు స్టంట్ పెర్ఫార్మర్లు, వారిని ప్రేమించేవారు ఎలాంటి బాధను అనుభవిస్తారో నేను దగ్గరగా చూశాను. ఒక స్టంట్‌మ్యాన్‌ గా వారి కుటుంబానికి మద్దతుగా మన పరిశ్రమలోని ప్రతి ఒక్కరూ నిలబడాలని కోరుతున్నాను. మన పనిలో ఉండటం మనకు, మన కుటుంబాలకు అంత సులభం కాదు. మన పరిశ్రమ ధైర్యాన్ని ఇస్తుంది. కానీ ధైర్యం ఎప్పుడూ మన భద్రతను కాపాడలేదు. ప్రతి మూవీ సెట్‌ లో శిక్షణ, భీమా, జవాబుదారీతనం, బలమైన ప్రోటోకాల్‌ ను యూనియన్లు అమలు చేయాలి. రాజు ప్రాణ త్యాగం మనకు మేల్కొలుపులాంటిది. మన హీరోలను, వారి కుటుంబాలను రక్షించుకోవాల్సిన బాధ్యత మనదే అంటూ పోస్ట్ చేశారు. ఈ సందర్బంగా మనోజ్ చేసిన ట్వీట్ ఇప్పుడు వైరల్ గా మారింది.