Manchu Manoj: నాన్న కాళ్లు పట్టుకోవాలని ఉంది… మళ్లీ మేమంతా కలుస్తాం…. మంచు మనోజ్ ఎమోషనల్ కామెంట్స్!

Manchu Manoj: మంచు మనోజ్ ప్రస్తుతం భైరవం సినిమా ప్రమోషన్ కార్యక్రమాలలో ఎంతో బిజీగా గడుపుతున్నారు. ఈ సినిమా మే 30 వ తేదీ ప్రేక్షకుల ముందుకు రాబోతున్న నేపథ్యంలో ప్రమోషన్ కార్యక్రమాలను వేగవంతం చేస్తున్నారు. అయితే ఈ ప్రమోషన్ కార్యక్రమాలలో భాగంగా మంచు మనోజ్ తన వ్యక్తిగత విషయాల గురించి తన కుటుంబ గొడవల గురించి కూడా అందరితో పంచుకుంటున్నారు.

గత కొంతకాలంగా మంచు మనోజ్ కుటుంబంలో పెద్ద ఎత్తున గొడవలు చోటు చేసుకోవడం బహిరంగంగానే ఈ అన్నదమ్ములు గొడవ పడటం , పోలీస్ స్టేషన్ మెట్లు ఎక్కి ఒకరిపై మరొకరు కేసులు పెట్టుకున్న విషయం మనకు తెలిసినదే. అయితే ఈ గొడవల గురించి మంచు మనోజ్ స్పందించారు. గత తొమ్మిది సంవత్సరాలుగా నా పని నేను చేసుకుంటున్నాను నా భార్య ఒక బొమ్మల కంపెనీ ప్రారంభించింది. నేను ఆర్ట్‌ వర్క్‌ చేశా. కథలు రాశా. ఆత్మగౌరవంతో బతికాం. నేను ఎలాంటి వాడినో చాలా మందికి తెలుసు. ఊహించని విధంగా మా కుటుంబంలో గొడవలు చోటు చేసుకున్నాయని తెలిపారు.

ఈ గొడవల కారణంగా నిస్సహాయ స్థితిలో ఉన్న నేను మీడియా ముందుకు రావాల్సి వచ్చిందని మనోజ్ తెలిపారు. నా భార్య ప్రెగ్నెన్సీ సమయంలో తిరిగి మేమందరం కలుసుకున్నాము కానీ ఇలా మేము కలవడం ఒక వ్యక్తికి నచ్చలేదు.మరోవైపు, కాలేజీలోని కొన్ని సమస్యల గురించి పెద్దాయన వరకూ వెళ్లడం లేదంటూ విద్యార్థులు లెటర్స్‌ రాసి నాకు ఇచ్చారు. ‘నీకేంటి సంబంధం?’ అన్న మాట బయటకు వచ్చింది అలాగే కాలేజీలో పనిచేసే వారితో నాపై నా భార్యపై కేసులు పెట్టారు. అక్కడ నా గుండె బద్దలైంది.

ఈ గొడవలకు ఏమాత్రం సంబంధం లేని నా భార్యపై కేసులు పెట్టడం తట్టుకోలేకపోయానని మనోజ్ తెలిపారు. ఆ సమయంలో వెళ్లి నేను మా నాన్న కాళ్లు పట్టుకోవాలని భావించేవాడిని నా కూతురిని ఆయన ఒడిలో కూర్చో పెట్టాలని ఆశపడ్డాను.కానీ, చేయని తప్పుని అంగీకరిస్తే..? నా పిల్లలకు నేనేం నేర్పిస్తా. మా నాన్న నేర్పించిన నీతి ఇది. అందుకే నేను ముందుకెళ్లలేపోతున్నా. మేమంతా మళ్లీ కలిసి ఉండాలని రోజూ దేవుడిని ప్రార్థిస్తున్నా. ఈ సమస్యలను ఎవరైతే సృష్టించారో వారు తమ తప్పులను తెలుసుకుంటారని ఆకాంక్షిస్తున్నాను అంటూ మనోజ్ ఈ సందర్భంగా చేసిన కామెంట్స్ ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి.