Manchu Manoj: తల్లికి బర్త్ డే విషెస్ చెప్పిన మంచు మనోజ్.. నీవల్లే అంతా కలిసి ఉన్నాం అంటూ!

Manchu Manoj: గత రెండు మూడు రోజులుగా ఎక్కడ చూసినా కూడా మోహన్ బాబు ఇంట జరిగిన గొడవల గురించి వార్తలు వినిపించడంతో పాటు ఈ విషయాల గురించి చర్చించుకుంటున్నారు. బాగా కలిసి మెలిసి ఉన్న మంచు ఫ్యామిలీకి అసలు ఏమయ్యింది ఎందుకు ఇలా కొట్టుకుంటున్నారు. ఈ గొడవలకు కారణం ఏంటి అన్న విషయాలు అర్థం కాక అభిమానులు తలలు పట్టుకుంటున్నారు. ప్రస్తుతం ఎక్కడ చూసినా మంచి ఫ్యామిలీకి సంబంధించిన పోస్టులే దర్శనమిస్తున్నాయి. ఇంట్లో నాలుగు గోడల మధ్య కూర్చొని పరిష్కరించుకోవాల్సిన సమస్త కాస్త బజారున పడడంతో పాటు పోలీస్ కేసుల వరకు వెళ్ళింది.

ఈ గొడవల నేపథ్యంలోనే మోహన్ బాబు కోపంతో టీవీ9 ప్రతినిధి పై దాడి చేసిన విషయం తెలిసిందే. ఆయనపై హత్యాయత్నం కేసు నమోదు కావడంతో ఈ గొడవలు తారా స్థాయికి చేరుకున్నాయి. ఇందులో తప్పెవరిదైనా మోహన్ బాబు భార్య, మనోజ్ తల్లి నిర్మలమ్మ మాత్రం తెగ కుమిలిపోతుంది. అయితే ఇప్పటివరకు ఆమె ఈ గొడవలపై స్పందించలేదు. ఈ నేపథ్యంలో నిర్మలమ్మ పుట్టిన రోజు కావడంతో సోషల్ మీడియా ద్వారా తన తల్లికి బర్త్ డే విషెస్ చెప్పాడు మనోజ్. తల్లితో కలిసి ఉన్న ఫొటోలను సోషల్ మీడియాలో షేర్ చేసిన మనోజ్.. హ్యాపీ బర్త్‌డే అమ్మ. మన కుటుంబానికి నువ్వు హృదయంలాంటి దానివి. నీ ఆత్మధైర్యం నన్ను ప్రతిరోజు ఇన్‌స్పైర్‌ చేస్తుంది.

 

నీ ప్రేమాభిమానాల వల్లే అందరం కలిసి ఉండగలుగుతున్నాము. నీకు ఎల్లప్పుడూ మంచి జరగాలని, సంతోషంగా ఉండాలని కోరుకుంటున్నాను. ఏం జరిగినా సరే నువ్వెప్పుడూ మాకు అండగా నిలబడ్డావు. అదే విధంగా నేనూ నీకు ఎల్లప్పుడూ తోడుగా ఉంటాను. నిన్ను చెప్పలేనంతగా ప్రేమిస్తున్నాను తల్లీ అంటూ తల్లిపై ప్రేమను కురిపిస్తూనే బర్త్ డే విషెస్ ని తెలిపారు మంచు మనోజ్. ఈ సందర్భంగా మంచు మనోజ్ షేర్ చేసిన ఫోటోలు పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఈ పోస్టుపై అభిమానులు ఒక్కొక్కరు ఒక్కొక్క విధంగా స్పందిస్తున్నారు. మీరు ఎప్పటిలాగే అందరు కలిసి ఉండాలని కోరుకుంటున్నాము అంటూ ఫ్యాన్స్ కామెంట్స్ చేస్తున్నారు.