Manchu Manoj: టాలీవుడ్ హీరో మంచు విష్ణు చాలా గ్యాప్ తర్వాత ప్రధాన పాత్రలో నటిస్తున్న లేటెస్ట్ మూవీ కన్నప్ప. ఈ సినిమాపై ఇప్పటికే భారీగా అంచనాలు నెలకొన్న విషయం తెలిసిందే. అంతేకాకుండా ఈ సినిమాకు సంబంధించి వినిపించిన వార్తలు ఈ సినిమాపై అంచనాలను భారీగా పెంచేసాయి. కన్నప్ప మూవీ నీ భారీ బడ్జెట్ తో, భారీ తారాగణంతో తెరకెక్కిస్తున్న విషయం తెలిసిందే. ఇందులో స్టార్ సెలబ్రిటీలు నటిస్తున్నారు. ఇకపోతే ఇటీవలే ఈ సినిమా హార్డ్ డిస్క్ మిస్సింగ్ వ్యవహారం తెలుగు సినిమా ఇండస్ట్రీలో సంచలనంగా మారిన విషయం తెలిసిందే. మాయం అయిన హార్ట్ డిస్క్ లో సినిమాకు సంబంధించిన కొన్ని కీలక అంశాలు ముఖ్యంగా ప్రభాస్ కు సంబంధించిన సన్నివేశాలు ఎక్కువగా ఉన్నాయి అంటూ కూడా ప్రచారం జరిగింది.
మంచు విష్ణు ఆఫీస్ లో పనిచేసే చరిత అనే యువతి కన్నప్ప హార్డ్ డిస్క్ తీసుకుని పరారైందని ఇప్పటికే పోలీసులను ఆశ్రయించారు. ఇటీవల చెన్నైలో జరిగిన సినిమా ప్రచారంలో మంచు విష్ణు స్పందిస్తూ.. తన సోదరుడు మంచు మనోజ్ ఇంట్లో పనిచేసే రఘు, చరిత అనే వ్యక్తులే ఈ పని చేసి ఉంటారని సంచలన ఆరోపణలు చేసిన విషయం తెలిసిందే. అలాగే వారే స్వయంగా చేశారా? లేక వారితో ఎవరికీ అయిన చెప్పి చేయించారా అన్నది తనకు తెలియదు అంటూ విష్ణు సంచలన ఆరోపణలు చేశారు. అయితే తాజాగా ఈ వాఖ్యలపై మంచు మనోజ్ స్పందించారు. మంచు మనోజ్ నటించిన లేటెస్ట్ సినిమా భైరవం.
తాజాగా మే 30న విడుదలైన ఈ సినిమా సూపర్ హిట్ కావడంతో ఈ సినిమా సక్సెస్ ను ఎంజాయ్ చేస్తున్నారు మంచు మనోజ్. ఈ సందర్భంగా చిత్రయూనిట్ సక్సెస్ మీట్ ఏర్పాటు చేసింది. ఈ క్రమంలోనే కన్నప్ప హార్డ్ డిస్క్ మీ దగ్గరే ఉందటగా? అని ఒక విలేకర్ ప్రశ్నించగా మంచు మనోజ్ స్పందిస్తూ.. నేను మీకే ఇచ్చాను కదా.. మర్చిపోయారా మీరు మొన్న కలిసినప్పుడు ఇచ్చాను కదా అంటూ సరదాగా ఆన్సర్ ఇచ్చారు. ఒక సినిమా సినిమా అనేది చాలా మందికష్టం. అందుకే తాను కన్నప్ప సినిమా విజయం సాధించాలని కోరుకుంటున్నట్లు తెలిపారు. మంచు మనోజ్ చేసిన కామెంట్స్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.