Manchu Manoj: కన్నప్ప సినిమా గురించి అలాంటి పోస్ట్ చేసిన మంచు మనోజ్.. ట్వీట్ వైరల్!

Manchu Manoj: డైరెక్టర్ ముఖేష్ దర్శకత్వంలో మంచు విష్ణు హీరోగా నటించిన లేటెస్ట్ చిత్రం కన్నప్ప. ఈ సినిమాను మోహన్ బాబు నిర్మాణంలో ఈ మూవీని నిర్మించిన విషయం తెలిసిందే. ఈ సినిమాలో టాలీవుడ్ స్టార్ హీరో ప్రభాస్ తో పాటు ఇంకా చాలామంది స్టార్ట్ సెలబ్రిటీలు నటించిన విషయం తెలిసిందే. ఇందులో ప్రభాస్ నటించడంతో ఈ మూవీపై భారీగా అంచనాలు నెల కొన్నాయి. ఇది ఇలా ఉంటే ఈ సినిమా నేడు ప్రేక్షకులు ముందుకు వచ్చిన విషయం తెలిసిందే. సినిమా విడుదలకు ముందే విడుదలైన టీజర్లు పోస్టర్లు ట్రైలర్ వంటివి సినిమాపై అంచనాలను భారీగా పెంచేసాయి.

ఇప్పటికే ప్రేక్షకుల నుంచి పాజిటివ్ రెస్పాన్స్ వస్తోంది. ఈ నేపథ్యంలోనే కొందరు సోషల్ మీడియా ద్వారా వారి స్పందనను తెలియజేస్తున్నారు. ఇది ఇలా ఉంటే కన్నప్ప సినిమాను ఉద్దేశిస్తూ మంచు మనోజ్ చేసిన ట్వీట్ ఇప్పుడు నెట్టింట వైరల్ గా మారింది. తన అన్న విష్ణు పేరును ప్రస్తావించకుండానే మూవీ టీంకు ఆల్ ది బెస్ట్ చెప్పారు. ఈ సినిమా విజయం సాధించాలని కోరుకుంటున్నట్లు తెలిపారు. కన్నప్ప టీంకు శుభాకాంక్షలు.. మా నాన్న, ఆయన టీమ్ ఈ సినిమా కోసం చాలా సంవత్సరాల పాటు కష్టపడ్డారు. ఈ సినిమా పట్ల ఎంతో ప్రేమను కురిపించారు. సినిమా బ్లాక్ బస్టర్ విజయం సాధించాలని నేను ప్రార్థిస్తున్నాను.

మై లిటిల్ చాంపియన్స్ అరి, వివి, అవ్రామ్ లను బిగ్ స్క్రీన్ మీద చూడడానికి ఆసక్తిగా ఎదురు చూస్తున్నాను. తనికెళ్ల భరణి లైఫ్ లాంగ్ డ్రీమ్ రేపు సజీవంగా మారుతున్నందుకు చాలా సంతోషంగా ఉంది. ఇక ప్రభాస్ గోల్డెన్ హార్ట్ గాడ్ ఆఫ్ ది గాడ్స్ మోహన్ లాల్, ప్రభుదేవా, అక్షయ్ కుమార్ తో పాటుగా ఈ మూవీపై ప్రేమతో నమ్మకంతో సపోర్ట్ చేసిన ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వక ధన్యవాదాలు. మీరందరూ పెద్ద తెరపై ప్రకాశించడం చూడాలని వెయిట్ చేస్తున్నాను. ఈ ప్రయాణాన్ని శివుడు ప్రేమతో ఆశీర్వదించాలి అంటూ మంచు మనోజ్ ట్వీట్ చేశారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన ట్వీట్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.