Manchu Manoj: నేను ఏ తప్పూ చేయలేదు..ఎక్కడికీ పారిపోను.. మంచు మనోజ్ కామెంట్స్ వైరల్!

Manchu Manoj: ప్రస్తుతం తెలుగు సినిమా ఇండస్ట్రీలో వరుసగా ఒకదాని తర్వాత ఒకటి వివాదాలు చోటు చేసుకుంటున్న విషయం తెలిసిందే. అందులో భాగంగానే గత రెండు రోజులుగా మంచు ఫ్యామిలీ గొడవలు బజారున పడటంతో పాటు అటు పోలీస్ స్టేషన్ మెట్లు ఇటు కోర్టు మెట్లు ఎక్కాయి. ఈ వ్యవహారం తెలుగు సినిమా ఇండస్ట్రీలో సంచలనంగా మారింది. పరస్పర దాడులు అభిమానులను ఒక్కసారిగా షాక్ కి గురి చేశాయి. అసలు ఈ గొడవ వ్యవహారంలో ఎవరి తప్పు అని తెలుసుకోలేక డైలమాలో పడ్డారు అభిమానులు. అయితే ఈ నేపథ్యంలోనే మద్యం మత్తులో హీరో మంచు మనోజ్‌ ఒక పెద్దాయనతో దురుసుగా ప్రవర్తించాడంటూ సోషల్‌ మీడియాలో ఒక వీడియో వైరల్‌గా మారింది.

ఈ వీడియో వైరల్ గా మారి మంచు మనోజ్ దే తప్పు అంటూ పెద్ద ఎత్తున వార్తలు రావడంతో తాజాగా ఈ విషయంపై మంచు మనోజ్ క్లారిటీ ఇచ్చారు. ఈ మేరకు మంచు మనోజ్ ఈ విషయంపై స్పందిస్తూ.. తెలంగాణ డీజీపీ ఆఫీస్‌కు వెళ్లిన తర్వాత జరిగిన ఒక బాధాకర సంఘటన గురించి చెప్పాలి. దానివల్ల నేను, నా భార్య ఎంతో నరకం అనుభవించాము. మా తొమ్మిది నెలల కుమార్తెను ఇంట్లో బంధించి మమ్మల్ని లోనికి వెళ్లకుండా అడ్డుకున్నారు. బలవంతంగా ఇంట్లోకి ప్రవేశించినప్పుడు మాపై దాడి చేశారు. ఆ సమయంలో నా చొక్కా కూడా చిరిగిపోయింది. నిస్సహాయ స్థితిలో ఉన్న నేను మీడియా సహాయం కోరాను. మా ఇంటి ఆవరణలోకి రావడంలో వాళ్లది ఏమాత్రం తప్పులేదు. దీనికి సంబంధించిన వీడియో రిలీజ్‌ చేయాలని విష్ణు భాగస్వామి రాజ్‌ కొందూరును కోరుతున్నాను. ఇప్పటికే కిరణ్‌, విజయ్‌ లను పోలీసులు అరెస్టు చేసి విచారిస్తున్నారు.

ఈ విచారణ పూర్తయితే నిజాలు బయటకు వస్తాయి. సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారిన వీడియో విషయానికి వస్తే.. తెల్ల చొక్కా వేసుకున్న వ్యక్తి నా ఛాతీపై కొట్టాడు. నన్ను నేను రక్షించుకునే క్రమంలో ఆయన్ను వెనక్కు నెట్టేశాను. రెండురోజుల్లో నాపై జరిగిన రెండో దాడికి ఇదే నిదర్శనం. అయినా మీ తొమ్మిది నెలల చిన్నారి నుంచి మిమ్మల్ని దూరం చేస్తే మీరేం చేస్తారో చెప్పండి.. ఆ సమయంలో నేను తాగి ఉన్నానని అసత్య ప్రచారం చేస్తున్నారు. ఆ రోజంతా నేను పోలీసులతో, మీడియాతోనే ఉన్నాను. అలాంటి సమయంలో నేనెక్కడ మందు తాగాను? వినయ్‌ కావాలనే నాపై ఈ పుకార్లు సృష్టించాడు. ఆస్తి కోసం డిమాండ్‌ చేస్తున్నానని aన్నాడు. నా పరువు మర్యాదలకు భంగం కలిగించి నా నోరు నొక్కేయాలని చూస్తున్నాడు.

 

కానీ నేను వెనక్కు తగ్గను. అలాగే ఇదంతా జరుగుతున్నప్పుడు నా సోదరుడు విష్ణు ఎక్కడా కనిపించలేదు. మా నాన్నను ఆస్పత్రికి తీసుకెళ్లేటప్పుడు మాత్రమే కనిపించాడు. దీనికంటే ముందు నాకు సపోర్ట్‌గా వచ్చినవారిని తన బౌన్సర్లతో భయపెట్టేందుకు ప్రయత్నించాడు. ఆయుధాలు కూడా తీసుకువస్తానన్నాడు. అయినప్పటికీ వారు ఏమాత్రం జంకకుండా నా కూతురికి రక్షణగా నిలబడ్డారు. వినయ్‌ నా కుటుంబాన్ని టార్గెట్‌ చేస్తున్నాడు. ఇది అన్యాయం, అనైతికం. నేను ఏ తప్పూ చేయలేదు. సాక్ష్యాధారాలతో నాపై చేసిన ప్రతి ఆరోపణను ఎదుర్కునేందుకు సిద్ధంగా ఉన్నాను. నేను ఎక్కడికీ పారిపోవడం లేదు. నిజం నిప్పులాంటిది.. కచ్చితంగా బయటకు వస్తుంది అని మనోజ్‌ ట్విట్టర్ లో రాసుకొచ్చాడు.