Manchu Manoj: మంచు ఫ్యామిలీ వివాదం తెలుగు సినిమా ఇండస్ట్రీలో మొన్నటి వరకు ఎంత సంచలనం సృష్టించిందో మనందరికీ తెలిసిందే. ప్రస్తుతం అల్లు అర్జున్ వివాదాలు ఎక్కువగా వినిపిస్తున్నాయి కానీ మొన్నటి వరకు అల్లు అర్జున్ ఈ వివాదం గురించి ఎక్కువగా చర్చించుకున్నారు. మంచి ఫ్యామిలీ వివాదంలో కూడా ఒకరిపై ఒకరు ఆరోపణలు చేసుకోవడంతో పాటు పోలీసులకు కేసులు పెట్టే వరకు వెళ్లిన విషయం తెలిసిందే. అయితే ఒక వారం రోజులుగా మంచి ఫ్యామిలీకి సంబంధించి ఎలాంటి అప్డేట్స్ లేకపోవడంతో ఈ ఫ్యామిలీ ఇష్యూ సద్దుమణిగిందని అందరూ అనుకున్నారు. కానీ ఇప్పుడు మరోసారి మంచి ఫ్యామిలీ వివాదం తెరపైకి వచ్చింది.
ఈసారి ఏకంగా మంచు మనోజ్ తన సోదరులు మంచు విష్ణు పై పోలీసులకు ఫిర్యాదు చేశాడు. అలాగే మోహన్‌బాబు విద్యా సంస్థల్ని పర్యవేక్షించే వినయ్ అనే వ్యక్తి పైనా కూడా కంప్లైంట్ చేశాడు. విష్ణు నుంచి తనకు ప్రాణహాని ఉందంటూ ఏడు పేజీల ఫిర్యాదును సోమవారం నాడు పోలీసులకు అందజేశాడు. మరి ఈ విషయంపై మోహన్ బాబు అలాగే మంజు విష్ణు ఏ విధంగా స్పందిస్తారో చూడాలి మరి. ఈ మంచు ఫ్యామిలీ వివాదంలో అసలు ఏం జరిగిందన్న విషయం చాలా మందికి తెలియదు. డిసెంబర్ 8న మోహన్‌బాబు ఇంట్లో హైడ్రామా నడిచింది. మనోజ్‌పై మోహన్‌బాబు దాడి చేశారంటూ ఓ వార్త వైరల్ అవ్వగా అంతలోనే నడవలేని పరిస్థితిలో మనోజ్ ఒక ఆస్పత్రిలో చేరాడు.
మనోజ్ తనపై దాడి జరిగిందంటూ డయల్ 100 కు ఫోన్ చేయడంతో పోలీసులు జల్‌పల్లిలో ఉన్న మోహన్ బాబు ఇంటికి వెళ్లారు. అయితే మోహన్ బాబు, మనోజ్ ఇది ఇంటి సమస్య అని చెప్పడంతో పోలీసులు వెనుదిరిగారు. ఇంతటితో సమస్య సద్దుమణిగిందని అనుకున్నారు. కానీ డిసెంబర్ 9న రాత్రి మనోజ్ పహాడీషరీఫ్ పోలీస్ స్టేషన్ కు వెళ్లి తనపై దాడి జరిగిందని ఫిర్యాదు చేయడంతో మోహన్ బాబు పై కేసు నమోదు చేశారు. ఇది జరిగిన గంటలోనే మోహన్ బాబు తనకు ప్రాణహాని ఉందంటూ రాచకొండ పోలీస్ కమిషనర్ సుధీర్ బాబుకు ఫిర్యాదు చేశాడు. మనోజ్, అతడి భార్య మౌనికపై చర్యలు తీసుకోవాలని కోరాడు. జర్నలిస్ట్ పై దాడి ఘటనలో మోహన్ బాబుపై పోలీసులు హత్యాయత్నం కేసు నమోదు చేశారు. ఈ కేసు ఇలా నడుస్తున్న సమయంలోనే ఇటీవల తన ఇంటి జనరేటర్ లో మంచు విష్ణు చక్కెరతో కలిపిన డీజిల్ పోసి ఇబ్బందులకు గురి చేశాడని మనోజ్ ఆరోపించాడు. అయితే ఆ ఆరోపణలో నిజం లేదని మోహన్‌బాబు సతీమణి నిర్మల వివరణ ఇచ్చింది. ఇలా రోజుకో మలుపు తిరుగుతూ ఈ మంచు ఫ్యామిలీ వివాదం కూడా అంతకంతకు పెరుగుతూనే ఉంది.