Manchu Brothers: మంచు కుటుంబంలో ఆస్తికోసం చోటు చేసుకున్న గొడవలు బహిర్గతం అయ్యాయి. ఆస్తి గురించి తండ్రి కొడుకుల మధ్య గొడవలు రావడమే కాకుండా పెద్ద ఎత్తున రోడ్లపైకి వచ్చి ఒకరిపై మరొకడు దాడి చేసుకోవడం జరిగింది. ఇలా ఒకరిపై మరొకరు దాడి చేసుకోవడంతో ఈ వివాదాలు కాస్త బయటపడ్డాయి.
గత కొంతకాలంగా గుట్టుగా కొనసాగుతున్న వివాదాలు కాస్త రట్టు కావడంతో ఏకంగా పోలీస్ స్టేషన్ మెట్లు ఎక్కి ఒకరిపై మరొకరు ఫిర్యాదులు కూడా చేసుకుంటున్న విషయం మనకు తెలిసిందే. ఇలా పెద్దల సమక్షంలో ఈ ఆస్తి వివాదాలకు ఎండ్ కార్డ్ ఇవ్వకుండా రోడ్లపైకి వచ్చి గొడవ పడుతున్న నేపథ్యంలో ఈ విషయం కాస్త సంచలనంగా మారింది. ఇప్పటివరకు సోషల్ మీడియా వార్తలలో ఉన్న మీడియా వార్తలలో నిలిచిన మంచు బ్రదర్స్ ప్రస్తుతం సోషల్ మీడియా వేదికగా ఒకరిపై మరొకరు విమర్శలు చేసుకుంటూ పోస్టులు చేస్తున్నారు.
ఈ క్రమంలోనే మంచు మనోజ్ మొదటిగా తన తండ్రి మోహన్ బాబు నటించిన రౌడీ సినిమా నుంచి తనకి ఇష్టమైన డైలాగ్ అంటూ ఒక డైలాగ్ పోస్ట్ చేశారు. సింహం అవ్వాలని ప్రతి కుక్కకి ఉంటుంది కానీ వీధిలో మొరగడానికి సింహ అడవిలో గర్జించడానికి చాలా తేడా ఉంటుంది. ఈ విషయాన్ని మరో జన్మలో కూడా నువ్వు అర్థం చేసుకోలేవు అంటూ పరోక్షంగా మంచు మనోజ్ కి కౌంటర్ ఇచ్చారని తెలుస్తుంది అయితే విష్ణు చేసిన ఈ పోస్ట్ పై మనోజ్ కౌంటర్ పోస్ట్ చేశారు.
ఈ సందర్భంగా మంచు మనోజ్ సోషల్ మీడియా వేదికగా స్పందిస్తూ…కన్నప్పలో రెబల్ స్టార్ కృష్ణం రాజు గారులాగా, సింహం అవ్వాలి అని ప్రతి ఫ్రాడ్ కుక్కకి ఉంటుంది. ఈ విషయం నువ్వు ఇదే జన్మలో తెలుసుకుంటావ్ అంటూ మనోజ్ పోస్ట్ చేశారు. ఇలా వీరిద్దరూ ఒకరిపై మరొకరు విమర్శలు చేసుకుంటూ సోషల్ మీడియాలో పోస్ట్లు చేయడంతో ఇది కాస్త సంచలనంగా మారింది అలాగే కొందరు మాత్రం విమర్శిస్తున్నారు.