మంచు బ్రదర్స్ కాంప్రమైజ్.! మీడియా మీదకి తోసేసి.!

‘అబ్బే, మా ఇద్దరి మధ్యా అసలు గొడవే లేదు.. మీడియానే అతి చేసింది..’ అంటూ మంచు మనోజ్, మంచు విష్ణు.. ఇద్దరూ కలిసి త్వరలో మీడియా ముందుకు రాబోతున్నారట. తెరవెనుకాల మొత్తం వ్యవహారాన్ని మంచు మోహన్‌బాబు సెట్ చేసేశారుట.

ఎప్పుడైతే మంచు మనోజ్, తన మీద దాడికి విష్ణు ప్రయత్నిస్తున్న వీడీయోను సోషల్ మీడియాలో షేర్ చేశాడో, ఆ తర్వాత మీడియాలో రచ్చ ఓ రేంజ్‌లో ప్రారంభమైంది. ఆ వెంటనే, అనూహ్యంగా చల్లారిపోయింది కూడా.

మీడియాని తెరవెనుకాల తనదైన స్టయిల్లో మోహన్‌బాబు మేనేజ్ చేయడంతో, ఆ తర్వాత మీడియా గమ్మునుండిపోయింది. తాజాగా, ఆ వివాదం గురించి స్పందించాల్సి వస్తే, ‘వాళ్ళనే అడగండి’ అంటూ మీడియా మీదికి తోసేశాడు మంచు మనోజ్.

కుటుంబం అన్నాక చిన్న చిన్న గొడవలు మామూలే. కానీ, సోషల్ మీడియాలో వీడియో విడుదల చేసే స్థాయికి గొడవ వెళ్ళినా, తూచ్.. అనేయడమంటే, దటీజ్ ‘మంచు’ స్కిల్.!