ఓరినీ వేషాలూ.. ఎంత దురద పెడితే మాత్రం జేసీబీతో గోకించుకుంటారా? వైరల్ వీడియో

man uses excavator to scratch his back video goes viral

మీకు దురద పెడితే ఏం చేస్తారు.. ఆ.. ఏం చేస్తాం.. చేయితో గోక్కుంటాం. లేకపోతే నువ్వొచ్చి గోకుతావా? ఏంటి.. అని అంటారా? ఎవరైనా దురద పెడితే చేయితోనే గోక్కుంటారు. కానీ.. ఈ వ్యక్తికి మాత్రం దురద పెడితే జేసీబీతో గోకించుకుంటాడు. అదే తేడా.. షాక్ అయ్యారు కదా.. వీడియో చూస్తే ఇంకా షాక్ అవుతారు.

man uses excavator to scratch his back video goes viral
man uses excavator to scratch his back video goes viral

ఈ ఘటన కేరళలో చోటు చేసుకున్నది. సాధారణంగా జేసీబీని తవ్వకాల కోసం ఉపయోగిస్తాం. కానీ.. ఓ కూలీ.. తనకు విపరీతంగా దురద పెడుతుండటంతో ఏం చేయాలో పాలుపోలేదు. దీంతో వెంటనే జేసీబీ ఆపరేటర్ ను రిక్వెస్ట్ చేసి మరీ… జేసీబీ చేయితో తన వీపు గోకాలంటూ అడిగాడు.

దీంతో జేసీబీ ఆపరేటర్ కూడా తన రిక్వెస్ట్ కు ఓకే చెప్పి.. ఆ వ్యక్తి వీపును జేసీబీతో గోకాడు. ఫన్నీగా జేసీబీ అతడి వీపు గోకుతుండగా… పక్కన ఉన్నవాళ్లు వీడియో తీసి సోషల్ మీడియాలో అప్ లోడ్ చేశారు. దీంతో ఆ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతోంది. వీపు మాత్రమేనా ఇంకా ఏమైనా గోకాలా.. అన్నట్టుగా జేసీబీ ఆపరేటర్.. జేసీబీని అతడి పొట్ట మీద పెట్టేసరికి.. నవ్వుకుంటూ అక్కడి నుంచి వెళ్లిపోయాడు.