మెగాస్టార్ చిరంజీవి తన కెరీర్‌లో ఎన్నో అద్భుతమైన చిత్రాలు చేశారు. మంచి మంచి టైటిల్స్‌తో సినిమాలు చేసిన మెగాస్టార్ అందులో ఆణిముత్యాల్లాంటి పాటలు ఉండేలా చేసుకున్నారు. పాటకు అనుగుణంగా న్యత్యం చేస్తూ అశేష ప్రేక్షకాదరణ పొందారు. ఇప్పుడు ఆయన మవీ టైటిల్స్‌తో పాటు సాంగ్స్‌పై కూడా ఫుల్ క్రేజ్ ఏర్పడింది. ఆ మధ్య చిరంజీవి నటించిన ఖైదీ, దొంగ చిత్రాలను తన సినిమాకు వాడుకున్నాడు కార్తి. ఇక ఇప్పుడు రవితేజ.. మెగాస్టార్ చిరంజీవి నటించిన క్లాసిక్ మూవీ చంటబ్బాయి చిత్ర టైటిల్‌ను తన 68వ సినిమాకు వాడుకోవాలని భావిస్తున్నాడట. ఇప్పటికే ఈ టైటిల్‌ను మేకర్స్ రిజిస్టర్ చేయించారని టాక్. త్వరలోనే దీనిపై క్లారిటీ రానుంది.
‘క్రాక్’ సినిమాతో మళ్లీ ఫామ్‌లోకి వచ్చిన మాస్ మహారాజా రవితేజ వరుస సినిమాలతో ప్రేక్షకులకు పసందైన వినోదాన్ని అందించేందుకు కసరత్తులు చేస్తున్నాడు. ప్రస్తుతం ఖిలాడి అనే చిత్ర షూటింగ్‌తో బిజీగా ఉన్న రవితేజ మరి కొద్ది రోజులలో ఈ చిత్ర షూటింగ్ పూర్తి చేసి ఆ తర్వాత తన 68వ చిత్రాన్ని ‘సినిమా చూపిస్తా మావ’, ‘నేను లోకల్’ వంటి హిట్ చిత్రాల దర్శకుడు త్రినాథరావు నక్కిన దర్శకత్వంలో చేయనున్నాడు. మాస్ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కుతోన్న ఈ చిత్రాన్ని పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ, అభిషేక్ అగర్వాల్ ఆర్ట్స్ పతాకాలపై టీజీ విశ్వప్రసాద్, అభిషేక్ అగర్వాల్ నిర్మిస్తున్నారు.
రవితేజ 68వ సినిమాకి వివేక్ కూచిబొట్ల సహ నిర్మాతగా వ్యవహరిస్తుండగా, ప్రసన్న కుమార్ బెజవాడ కథ, స్క్రీన్ ప్లే అందిస్తున్నారు. మరోవైపు ఈ చిత్రంలో రవితేజ తండ్రిగా, కొడుకుగా కనిపించనుండగా, ఆయన సరసన ఐశ్వర్య మీనన్, శ్రీలీలాను ఎంపిక చేసినట్టు తెలుస్తుంది. ఐశ్వర్య మీనన్ గతంలో లవ్ ఫెయిల్యూర్ అనే తెలుగు సినిమాలో హీరోయిన్ గా నటించగా.. శ్రీలీలా దర్శకేంద్రుడు రాఘవేంద్ర రావు పర్యవేక్షణలో రూపొందుతున్న పెళ్ళి సందడి సినిమా సీక్వెల్ ‘ పెళ్లి సందD ‘ లో నటిస్తుంది.