పుష్ప 2 గురించి అదిరిపోయే అప్డేట్… సీక్వెల్ కోసం భారీగా ఖర్చు పెడుతున్న మేకర్స్?

టాలెంటెడ్ డైరెక్టర్ సుకుమార్, ఐ కాన్ స్టార్ అల్లు అర్జున్ కాంబినేషన్లో వచ్చిన పుష్ప సినిమా పాన్ ఇండియా లెవెల్ లో ప్రపంచ వ్యాప్తంగా విడుదలై సంచలనాలు సృష్టించింది. ఈ సినిమాలో అల్లు అర్జున్ నటన విమర్శకుల ప్రశంసలు సైతం అందుకుంది. ఈ సినిమా సీక్వెల్ కోసం అభిమానులు ఎంతో ఆతృతగా ఎదురుచూస్తున్నారు. మార్చిలోనే షూటింగ్ ప్రారంభించాల్సిన ఈ సినిమా అనుకోని కారణాలవల్ల వాయిదా పడుతూ వచ్చింది. అల్లు అర్జున్ అభిమానులు సినిమా షూటింగ్ ఎప్పుడు స్టార్ట్ అవుతుంది అంటూ ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. అయితే పుష్ప పార్ట్ 1 తో సూపర్ హిట్ అందుకున్న సుకుమార్ పార్ట్ 2 కోసం చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నాడు.

పాన్ ఇండియా లెవెల్ లో తెరకెక్కుతున్న పుష్ప 2 సినిమా పాన్ ఇండియా ఇమేజ్ మరింత పెంచేందుకు సుకుమార్ అదనపు జాగ్రత్తలు తీసుకోవడమే కాకుండా, అదనపు హంగులు కూడా యాడ్ చేస్తూ అన్ని రకాల జాగ్రత్తలు తీసుకుంటున్నాడు. ఇదిలా ఉండగా ఇటీవల ఈ సినిమా కి సంబందించిన ఒక వార్త నెట్టింట్లో చక్కర్లు కొడుతోంది. పుష్ప 2 సినిమా షూటింగ్ తొందర్లోనే పట్టలెక్కనుంది. ఆగస్టు చివరి వారంలో ఈ సినిమా షూటింగ్ ప్రారంభం కానున్నట్లు సమాచారం. అయితే ఈ వార్త తెలియటంతో అల్లు అర్జున్ అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఈ సినిమా కోసం అల్లు అర్జున్ అభిమానులతో పాటు విదేశాలలో ప్రేక్షకులు కూడా ఆతృతగా ఎదురుచూస్తున్నారు.