పవన్ కళ్యాణ్ కోసం “మేజర్” సినిమా స్పెషల్ షో..క్లారిటీ ఇచ్చిన యంగ్ హీరో.!

ప్రస్తుతం పాన్ ఇండియా సినిమా దగ్గర ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్న మరో ఇంట్రెస్టింగ్ భారీ చిత్రం “మేజర్”. యంగ్ అండ్ టాలెంటెడ్ హీరో అడివి శేష్ నటించిన ఈ సినిమా రియల్ లైఫ్ హీరో మేజర్ సందీప్ ఉన్ని కృష్ణన్ జీవితం ఆధారంగా తెరక్కింది. అయితే ఈ సినిమా ముంబై బాంబు దాడుల నేపథ్యంలో తెరకెక్కగా మరికొన్ని రోజుల్లో చాలా ప్రతిష్టాత్మకంగా రిలీజ్ కాబోతోంది. అయితే ఈ సినిమా మన దేశ సైనికులు భక్తి కి ప్రతీకగా తెరకెక్కింది.

అయితే మరి మన తెలుగు సినిమా లో మన దేశం పట్ల అపారమైన గౌరవం ఉన్న స్టార్ హీరోలలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కూడా ఒకరు. ఎప్పుడు నుంచో తన సినిమాల్లో దేశం కోసం సమాజం కోసం ఎన్నో పాటలు సన్నివేశాలు పెట్టి తన దేశ భక్తి చాటుకున్నారు. మరి అలాంటి పవన్ కి ఈ మేజర్ సినిమాని చూపించడం పై హీరో అడివి శేష్ బిగ్ క్లారిటీ ఇచ్చాడు.

ఈ సినిమాని డెఫినెట్ గా పవన్ కళ్యాణ్ గారికి స్పెషల్ షో వేసి చూపిస్తానని అది మాత్రం పక్కా అని కన్ఫర్మ్ చేసాడు. దీనితో ఎస్ వార్త విని పవన్ అభిమానులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. మరి ఈ సినిమా చూసాక పవన్ ఎలా స్పందిస్తారో చూడాలి. ఇంకా ఈ సినిమాని దర్శకుడు శశి కిరణ్ తెరకెక్కించాడు.

అలాగే సాయి మంజ్రేకర్ హీరోయిన్ గా నటించిన ఈ సినిమాని మహేష్ ప్రొడక్షన్ హౌస్, ఏ అండ్ ఎస్ స్టూడియోస్ అలాగే సోనీ పిక్చర్స్ ఇండియా వాళ్ళు భారీ బడ్జెట్ తో నిర్మాణం వహించగా ఈ జూన్ 3న ఈ సినిమా విడుదల కానుంది.