“పుష్ప 1” నుంచి ముందు రోజుల్లో అసలైన మజా.!

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ ని కాస్తా ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ గా పాన్ ఇండియన్ లెవెల్లో ప్రెజెంట్ చెయ్యబోతున్న లేటెస్ట్ సినిమా “పుష్ప పార్ట్ 1”. దర్శకుడు సుకుమార్ ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్న ఈ భారీ సినిమాని చిత్ర యూనిట్ అన్ని విధాలా సంసిద్ధం చేస్తున్నారు. మరి ఈరోజు ఆల్రెడీ సినిమా నుంచి నాలుగో పాటపై అదిరే అప్డేట్ ని ఇచ్చిన చిత్ర బృందం ఇప్పుడు ఇంకో బిగ్ అప్డేట్ ని రివీల్ చేసింది.

ఈ సాంగ్ తర్వాత ముందు రోజుల్లో అసలైన అప్డేట్స్ ఈ చిత్రం నుంచి రాబోతున్నాయట. మొదటగా ట్రైలర్ ఆ తర్వాత సినిమాలోని 5వ పాట ఇంకా సినిమా గ్రాండ్ ఈవెంట్స్ అలాగే మరికొన్ని సర్ప్రైజ్ అప్డేట్స్ కూడా ఉన్నాయని చిత్ర నిర్మాతలు మైత్రి మూవీ మేకర్స్ బ్యానర్ వారు స్పష్టం చేశారు. దీనితో ముందు రోజుల్లో బన్నీ అభిమానులకి పండగే అని చెప్పాలి.