“RRR” కోసం మహేష్ వెనక్కి తగ్గుతాడా.?

కొన్ని స్పెషల్ సినిమాలు తమ రిలీజ్ డేట్ లు అనౌన్స్ చేస్తే ఏ ఇండస్ట్రీలో అయినా కూడా మిగతా సినిమాల డేట్స్ మారిపోతాయి. ఇప్పుడు మళ్ళీ టాలీవుడ్ లో ఇలాంటి పరిస్థితినే నెలకొనేలా ఉంది. తెలుగు సినిమా నుంచి బాహుబలి తర్వాత మళ్ళీ అన్ని అంచనాలు నెలకొల్పుకొని వస్తున్న భారీ సినిమా ‘RRR’.

దర్శక దిగ్గజం రాజమౌళి రామ్ చరణ్ మరియు ఎన్టీఆర్ లతో తీస్తున్న ఈ ఫిరోషియస్ మల్టీ స్టారర్ కోసం అంతా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఇప్పుడు రిలీజ్ డేట్ పై కూడా త్వరలోనే క్లారిటీ వస్తుండడంతో మిగతా సినిమాలకు టెన్షన్ పట్టుకుంది. అయితే ఈ చిత్రం సంక్రాంతి బరిలో ఉంటుంది అని టాక్ వినిపిస్తుండగా ఈ సినిమా కోసం మహేష్ వెనక్కి తగ్గుతాడా అని సమాచారం వినిపిస్తుంది.

పరశురామ్ తో చేస్తున్న “సర్కారు వారి పాట” సినిమాని మహేష్ రాజమౌళి కోసం వాయిదా వేసుకునే అవకాశం ఉందని నయా టాక్. ఎలానో ఈ సినిమా తర్వాత మహేష్ రాజమౌళితో ఫస్ట్ పాన్ ఇండియన్ సినిమా చెయ్యనున్నాడు ఆ లెక్కన వాయిదా వెయ్యొచ్చని టాక్. ఇక దీనిపై మరింత సమాచారం రావాల్సి ఉంది.