కొడుకు కోసం తపన పడుతూ దేశ విదేశాలు తిరుగుతున్న మహేష్.. ఎందుకంటే?

టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు తనకు సినిమాల పరంగా ఏమాత్రం విరామం దొరికిన వెంటనే తన కుటుంబ సభ్యులతో కలిసి విదేశీ పర్యటనలకు వెళ్లడం మనం చూస్తున్నాము.ఈ క్రమంలోనే ఈయన ఈ మధ్యకాలంలో తరచూ హాలిడేషన్ వెళ్లి ఎంజాయ్ చేస్తున్నారు.అయితే ప్రస్తుతం మహేష్ బాబు విదేశీ పర్యటనలు వెళుతున్నది తాము ఎంజాయ్ చేయడం కోసం కాదట.తన కుమారుడు కోసమే మహేష్ బాబు దేశ విదేశాలు తిరుగుతున్నట్టు తెలుస్తుంది. అసలు గౌతమ్ కోసం మహేష్ బాబు అలా తిరగడం ఏంటి అనే విషయానికి వస్తే..

మహేష్ బాబు కుమారుడు గౌతమ్ ఇటీవలే చిరెక్ ఇంటర్నేషనల్ స్కూల్ లో సీబీఎస్ఈలో తాజాగా పదో తరగతి ప్రథమ గ్రేట్ లో ఉత్తీర్ణత సాధించారు.ఇదే విషయాన్ని మహేష్ బాబు భార్య నమ్రత సోషల్ మీడియా వేదికగా తెలియజేస్తూ ఎంతో గర్వకారణంగా ఉంది అంటూ ఒక ఎమోషనల్ పోస్ట్ చేశారు. అయితే పదవ తరగతి పూర్తి చేసుకున్న గౌతమ్ కాలేజీ చదువుకు ప్రమోట్ అయ్యారు.అయితే గౌతమ్ ను ఇండియాలో కాకుండా ఇతర దేశాలలో చదివించాలనే ఉద్దేశంతోనే మహేష్ బాబు పలు దేశాలలో పర్యటించి మంచి కాలేజీలో తనని జాయిన్ చేశారని తెలుస్తోంది.

మహేష్ బాబు తన కుమారుడిని ఏ కాలేజ్ చేర్పించారు, ఏ కోర్స్ జాయిన్ చేశారు, ఏ దేశంలో తన కాలేజీ చదువుల కోసం చేర్పించారు అనే పూర్తి విషయాలు తెలియకపోయినా ఈయన మాత్రం ఎన్ని రోజులు తన కొడుకు కోసమే తపన పడుతూ అన్ని దేశాలలో తిరిగి మంచి కాలేజీలో చేర్పించారని తెలుస్తుంది. అయితే ఇన్ని రోజులు గౌతమ్ హైదరాబాదులోనే ఇద్దరు కూడా జాయిన్ అయ్యారని వార్తలు వచ్చాయి. అయితే గౌతమ్ ను మహేష్ బాబు విదేశాలలో జాయిన్ చేసినట్లు తెలుస్తోంది.