మహేష్ బాబు నా కోసం ఆ పని ఎప్పటికీ చేయడు.. నమ్రత కామెంట్స్ వైరల్!

టాలీవుడ్ ఇండస్ట్రీలో ఎంతో అందమైన జంటగా పేరు సంపాదించుకున్న వారిలో మహేష్ బాబు నమ్రత జంట ఒకటి. వంశీ సినిమా ద్వారా వీరిద్దరికీ పరిచయం ఏర్పడి ఆ పరిచయం ప్రేమకు దారి తీసింది. ఈ విధంగా పెద్దలొద్దంటున్నా మహేష్ బాబు నమ్రత ఆర్యసమాజ్ లో వివాహం చేసుకున్నారు.ఇకపోతే వివాహమైన తర్వాత నమ్రత పూర్తిగా సినీ ఇండస్ట్రీకి గుడ్ బై చెబుతూ తన వ్యక్తిగత జీవితాన్ని ఎంజాయ్ చేస్తూ గడుపుతున్నారు. ఈ క్రమంలోనే ఒక భార్యగా, ఒక తల్లిగా, ఒక కోడలిగా ఈమె తన బాధ్యతలను ఎంతో సక్రమంగా నిర్వహిస్తోంది.

తాజాగా ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న నమ్రత తన గురించి, మహేష్ బాబు గురించి పలు ఆసక్తికరమైన విషయాలను వెల్లడించారు.మహేష్ బాబు ప్రస్తుతం వరుస సినిమాలతో ఎంతో బిజీగా ఉన్నప్పటికీ తనకు ఏ మాత్రం ఖాళీ సమయం దొరికిన వెంటనే మమ్మల్ని ఫారిన్ ట్రిప్ తీసుకెళ్తారని తెలిపారు.ఇక అక్కడికి వెళ్తే మాకు ఇష్టమైన విధంగా షాపింగ్ చేస్తూ మాకు ఇష్టమైన ఫుడ్ తింటూ ఎంతో ఎంజాయ్ చేస్తామని నమ్రత తెలిపారు. ఇకపోతే మహేష్ బాబుకి షాపింగ్ చేయడం అంటే ఎంతో చిరాకు.ఆయన షాపింగ్ కూడా నేనే చేస్తానని కానీ తన కోసం మహేష్ బాబు ఎప్పుడూ కూడా ఎలాంటి షాపింగ్ చేయలేదని తెలిపారు.

ఇకపోతే తాను సినిమా ఇండస్ట్రీకి దూరమవడంతో చాలామంది తన రీ ఎంట్రీ గురించి అడుగుతున్నారని అయితే కుటుంబం పట్ల తనకు ఎన్నో బాధ్యతలు ఉన్నాయని ఆ బాధ్యతలను నిర్వర్తిస్తూ తన జీవితంలో ఎంతో సంతృప్తిగా గడుపుతున్నానని, అందుకే తాను సినిమా ఇండస్ట్రీకి రీ ఎంట్రీ ఇవ్వడం లేదని ఈ సందర్భంగా నమ్రత తెలియజేశారు. ఈ క్రమంలోనే నమ్రత మహేష్ బాబు గురించి చేసిన ఈ వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి