Mahesh Babu: చిరంజీవి పై అసహనం వ్యక్తం చేసిన మహేష్ బాబు… కారణం ఆ సినిమానేనా?

Mahesh Babu: టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు మెగాస్టార్ చిరంజీవి మధ్య ఎంతో మంచి సాన్నిహిత్యం ఉందనే ఈ విషయం మనందరికీ తెలిసిందే. అయితే తాజాగా సూపర్ స్టార్ మహేష్ బాబు మెగాస్టార్ చిరంజీవి పై తీవ్ర అసహనం వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది.ఇలా ఉన్న ఫలంగా మెగాస్టార్ చిరంజీవి మహేష్ బాబు ఆగ్రహం వ్యక్తం చేయడానికి గల కారణం ఏమిటి అనే విషయానికి వస్తే… ఆచార్య సినిమా విడుదల అని మాత్రమే చెప్పాలి.ఫిబ్రవరి 4వ తేదీ రావాల్సిన మెగాస్టార్ ఆచార్య సినిమా ఏప్రిల్ 1వ తేదీకి వాయిదా పడిన విషయం మనకు తెలిసిందే.

అయితే సంక్రాంతి బరి నుంచి తప్పుకున్న సర్కారీ వారి పాట ఏప్రిల్ 1వ తేదీ విడుదల చేయనున్నట్లు ప్రకటించారు.ఈ క్రమంలోనే సర్కారీ వారి పాట చిత్ర బృందాన్ని ఏమాత్రం సంప్రదించకుండా.. ఆచార్య టీం తమ సినిమాను ఏప్రిల్ ఒకటవ తేదీ విడుదల చేయనున్నట్టు ప్రకటించడం పట్ల మహేష్ బాబు మెగాస్టార్ చిరంజీవి డైరెక్టర్ కొరటాల శివ పై సన్నిహితుల దగ్గర అసహనం వ్యక్తం చేస్తున్నట్లు తెలుస్తోంది.

మహేష్ బాబు మోకాలి సర్జరీ కరోనా ప్రభావం వల్ల ఈ సినిమా షెడ్యూల్ చిత్రీకరణ వాయిదా పడింది. ఈ క్రమంలోనే ఈ సినిమా ఏప్రిల్ నెలలో కాకుండా ఆగస్టుకు వాయిదా పడిందని తెలియడంతోనే ఆచార్య 1వ తేదీకి రానున్నట్లు ప్రకటించారని సమాచారం. మరి ఈ విషయంలో ఎంత వరకు నిజం ఉందో తెలియాలంటే మరోసారి సర్కారీ వారి పాట చిత్ర బృందం తమ విడుదల తేదీ గురించి అధికారికంగా ప్రకటించాల్సి ఉంది.