చిన్నపిల్లల గుండె ఆపరేషన్ లపై విషం చిమ్ముతున్న మహేష్ యాంటీ ఫ్యాన్స్?

సాధారణంగా సినిమా ఇండస్ట్రీలో ఒక హీరో ఒక అభిమానులు మరొక హీరోల సినిమాల పై నెగిటివ్ కామెంట్లు, నెగిటివ్ రివ్యూలు ఇవ్వడం సర్వసాధారణం. ఈ క్రమంలోనే మహేష్ బాబు అభిమానులు పవన్ కళ్యాణ్ నటించిన భీమ్లా నాయక్, మెగాస్టార్ చిరంజీవి నటించిన ఆచార్య సినిమాల పై నెగిటివ్ కామెంట్లు ఇవ్వడంతో ప్రస్తుతం మెగా అభిమానులు సైతం మహేష్ బాబు సర్కారీ వారి పాట సినిమా పై ఎటాక్ చేస్తున్నారు. ఈ క్రమంలోని సినిమా ఫస్ట్ షో నుంచి డిజాస్టర్ అంటూ ట్రెండ్ చేస్తూ ఉన్నారు.

ఈ విధంగా సినిమాల పరంగా ఈ విధమైనటువంటి నెగిటివ్ కామెంట్లు రివ్యూలు రావడం సర్వసాధారణం. అయితే ఈసారి మహేష్ ఫ్యాన్స్ మాత్రం మరొక అడుగు ముందుకేసి మహేష్ బాబు తన ఫౌండేషన్ ద్వారా ఎంతో మంది చిన్న పిల్లలకు గుండె ఆపరేషన్ లు చేస్తున్న సంగతి మనకు తెలిసిందే. ఈ క్రమంలోనే ఈ విషయంపై మహేష్ బాబు యాంటీ ఫ్యాన్స్ విషం చిమ్ముతూ కామెంట్లు చేయడం దారుణం.

ఈ విషయంపై కొందరు స్పందిస్తూ సర్కారీ వారి పాట ఫేక్ కలెక్షన్లు మాదిరిగానే చిన్న పిల్లలకు గుండె ఆపరేషన్ల సంఖ్య కూడా ఫేక్ అంటూ కామెంట్ చేస్తున్నారు. అదేవిధంగా మరికొందరు ట్యాక్స్ ఎగ్గొట్టడానికి పిల్లలకు గుండె ఆపరేషన్లు.. అంటూ నాటకాలాడుతున్నారని మహేష్ బాబు ఫౌండేషన్ గురించి దారుణమైన కామెంట్లు చేస్తున్నారు.ఈ క్రమంలోనే ఈ విధమైనటువంటి వివాదాలకు చెక్ పెట్టాలంటే హీరోలు అందరూ కలిసికట్టుగా ముందుకు వస్తే తప్ప వివాదాలకు చెక్ పెట్టలేమని చెప్పవచ్చు.ఇక మహేష్ బాబు నటించిన సర్కారీ వారి పాట సినిమా పై ఎలాంటి దుష్ప్రచారాలు చేసిన ఈ సినిమా మాత్రం కలెక్షన్ల సునామీ సృష్టిస్తోంది.