మహేష్ బాబు రికార్డు రెమ్యూనరేషన్

ఒకప్పుడు టాలీవుడ్ లో చిరంజీవి కోటి కి పైగా రెమ్యూనరేషన్ తీసుకుంటేనే అది నేషనల్ న్యూస్ అయ్యింది. ఇండియాలోనే కోటి కి పైగా రెమ్యూనరేషన్ తీసుకున్న నటుడిగా చిరంజీవి అప్పట్లో రికార్డు సృష్టించాడు. కానీ ఇప్పుడు హీరోల రెమ్యూనరేషన్ ఆకాశానంటుతున్నాయి. ఒక్క సినిమా హిట్ అయితే చాలు రెమ్యూనరేషన్స్ పెరిగిపోతున్నాయి.

టాలీవుడ్ లో ఇప్పుడున్న స్టార్ హీరోలు ప్రభాస్, మహేష్ బాబు, రామ్ చరణ్, ఎన్టీఆర్, అల్లు అర్జున్ రెమ్యూనరేషన్స్ చూస్తే షాక్ అవ్వలిసిందే. ఈ లిస్ట్ లో మహేష్ బాబు తప్ప అందరికి పాన్ ఇండియా రీచ్ ఉంది.

అయితే తాజా సమాచారం ప్రకారం మహేష్ బాబు తన నెక్స్ట్ మూవీ త్రివిక్రమ్ సినిమాకి ఏకంగా 70 కోట్ల రూపాయలు జీఎస్టీ రెమ్యునరేషన్ గా తీసుకుంటున్నారని సమాచారం అందుతోంది.

పూజ హెగ్డే హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమా షూటింగ్ ఈ మధ్యే మొదలైంది. త్వరలో ఈ సినిమా షూటింగ్ కంప్లీట్ చేసి నెక్స్ట్ ఇయర్ సమ్మర్ కి రిలీజ్ చేసే ప్లాన్ లో ఉన్నాడు త్రివిక్రమ్. ఈ సినిమా కంప్లీట్ అయ్యాక మహేష్ రాజమౌళి సినిమా స్టార్ట్ చేస్తాడు.