Unstoppable show: బాలయ్య షోలో… మహేష్ మనసులో మాటలు !

Mahesh babu open up about his charitable works in unstoppable show

Unstoppable show: నటసింహం బాలయ్య బాబు మొదటిసారి హోస్ట్ గా చేస్తున్న ‘అన్‌‌స్టాపబుల్ విత్ NBK’ మొత్తానికి మరో రికార్డు సాధించింది. ఇండియన్ మూవీ డేటా బేస్(IMDB)లో చోటు సంపాదించి టాప్-10 రియాలిటీ టీవీ జాబితాల్లో ‘అన్ స్టాపబుల్’ షో ఐదో స్థానంలో నిలవడం విశేషం. బాలయ్య హోస్టింగ్‌ కు ఫ్యాన్స్ ఫిదా అయిపోయారు. ఈ షో ఓటీటీ వేదిక ‘ఆహా’లో టెలికాస్ట్ అవుతుండగా… ఇప్పటివరకు మొత్తం 7 ఎపిసోడ్స్ పూర్తి అయ్యాయి. కాగా… గత ఎపిసోడ్ లో హీరో రవితేజ, డైరెక్టర్ గోపీచంద్ మలినేని షోలో పాల్గొన్నారు.

ఇక ఈ ‘అన్ స్టాపబుల్’ షోకి మహేష్ బాబు ముఖ్య అతిథిగా రాబోతున్న సంగతి తెలిసిందే. ఆల్ రెడీ మహేష్ తో ఆ ఎపిసోడ్ ను కూడా షూట్ చేశారు. త్వరలోనే ఆ ఎపిసోడ్ స్ట్రీమ్ కాబోతుంది. పైగా అదే చివరి ఎపిసోడ్ అని కూడా గత కొన్ని రోజులుగా వార్తలు వసున్నాయి. అన్నట్టు మహేష్ ఎప్పుడూ తాను చేస్తున్న సామాజిక కార్యక్రమాల గురించి తనకు తానుగా బయట పెట్టింది లేదు.

అయితే బాలయ్య షోలో మహేష్ మనసు విప్పి మాట్లాడాడు అని, ముఖ్యంగా మహేష్ తన సేవా కార్యక్రమాల గురించి చెప్పాడని… బుర్రిపాలెం, సిద్దాపురం అనే రెండు గ్రామాలను తాను దత్తత తీసుకుని… ఆ గ్రామాల్లో చేసిన సేవా కార్యక్రమాల గురించి మహేష్ ఈ ఎపిసోడ్ లో వివరంగా చెప్పారని తెలుస్తోంది. పైగా తన సంపాదనలో నుంచి 30% వరకు వృద్ధాశ్రమాలు, పిల్లల ఆరోగ్య సంబంధిత ‘NGO’లకు మహేష్ విరాళంగా ఇస్తున్నాను అని కూడా చెప్పినట్లు తెలుస్తోంది.