Mahesh Babu: మహేష్ బాబుకు ఆ ఆహారం అంటే అంత ఇష్టమా.. అది తింటూ ఇంత అందమా?

Mahesh Babu: టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు ఈయన ప్రస్తుతం వరుస సినిమాలతో ఎంతో బిజీగా ఉండటమే కాకుండా పలు కార్యక్రమాలకు హాజరవుతూ ప్రేక్షకులకు కావలసినంత సంతోషాన్ని పంచుతున్నారు. ఇదిలా ఉండగా తాజాగా మహేష్ బాబు జూనియర్ ఎన్టీఆర్ వ్యాఖ్యాతగా వ్యవహరిస్తున్న ఎవరు మీలో కోటీశ్వరులు కార్యక్రమానికి వచ్చిన సంగతి తెలిసిందే. ఈ కార్యక్రమంలో భాగంగా ఎన్టీఆర్ మహేష్ బాబు ఎన్నో వ్యక్తిగత విషయాలను సరదాగా ముచ్చటిస్తూ ప్రేక్షకులకు తెలియజేశారు.

ఇక ఈ కార్యక్రమంలో ఎన్టీఆర్ మాట్లాడుతూ మహేష్ బాబుకు ఇష్టమైన ఆహారం ఏంటి అని ప్రశ్నించగా అందుకు మహేష్ బాబు చిన్నప్పుడు తన అమ్మమ్మ చేతి వంట రుచిని గుర్తు చేసుకున్నారు. చిన్నప్పుడు అమ్మమ్మ చేతి వంట ఎంతో రుచిగా ఉండేదని అయితే అమ్మమ్మ చనిపోయిన తరువాత అలాంటి ఆహారం రుచి చూడలేదని మహేష్ బాబు తెలిపారు. ప్రస్తుతం ఉప్పు కారం లేని ఆహారం తీసుకుంటున్నామని కొద్దిగా కారం ఉన్న ఆహార పదార్థాలు తింటే వెంటనే వళ్ళంతా చెమటలు వస్తున్నాయని తెలిపారు.

ఇక ప్రస్తుతం తనకు హైదరాబాద్ బిర్యానీ అంటే చాలా ఇష్టమని అలాగే నువ్వు (ఎన్టీఆర్) పంపించే బిర్యానీ అన్న కూడా చాలా ఇష్టంగా తింటానని మహేష్ బాబు తనకు ఇష్టమైన హైదరాబాద్ బిర్యానీ గురించి తెలిపారు.ఇక సినిమాల విషయానికొస్తే మహేష్ బాబు ప్రస్తుతం సర్కారీ వారి పాట చిత్రంతో బిజీగా ఉన్నారు ఈ సినిమా వచ్చే ఏడాది వేసవి సెలవులకు ప్రేక్షకుల ముందుకు రానుంది ఈ సినిమాలో మహేష్ బాబు సరసన కీర్తి సురేష్ నటిస్తున్నారు.