అలీ కెరీర్ మలుపు తిరగడానికి మహేష్ బాబు కారణమా.. ఏం జరిగిందంటే?

చాలా సందర్భాల్లో ఒక హీరో నటించాల్సిన సినిమాలో మరొకరు నటించి విజయాలు సాధించిన సందర్భాలు ఉన్నాయి. కమెడియన్ అలీ కెరీర్ ను మలుపు తిప్పిన సినిమాలలో యమలీల సినిమా ఒకటి. అప్పటివరకు కామెడీ రోల్స్ లో నటించిన అలీ ఈ సినిమాతో హీరోగా మారడంతో పాటు కమర్షియల్ సక్సెస్ ను ఖాతాలో వేసుకున్నారు. ఎస్వీ కృష్ణారెడ్డి డైరెక్షన్ లో తెరకెక్కిన ఈ సినిమా సంచలన విజయాన్ని సొంతం చేసుకుంది.

ఈ సినిమాలో కామెడీ అద్భుతంగా ఉండటంతో పాటు తల్లీకొడుకుల సెంటిమెంట్ ఈ సినిమా సక్సెస్ లో కీలక పాత్ర పోషించింది. మహేష్ బాబు ఈ సినిమాలో నటించి ఉంటే మాత్రం అలీ ఈ సినిమాలో నటించే ఛాన్స్ మిస్ చేసుకునేవారు. ఒక విధంగా అలీ కెరీర్ మలుపు తిరగడానికి మహేష్ బాబు కారణమయ్యారని చెప్పవచ్చు. ఈ సినిమా తీసే సమయానికి మహేష్ బాబు పలు సినిమాలలో బాలనటుడిగా నటించారు.

ఎస్వీ కృష్ణారెడ్డి హీరో కృష్ణకు కథ చెప్పగా కృష్ణకు కూడా ఆ కథ ఎంతగానో నచ్ఛింది. అయితే కొన్ని ఇబ్బందులు ఎదురు కావడంతో మహేష్ బాబుతో అలీ సినిమాను తెరకెక్కించలేకపోయారు. కృష్ణ చేసిన స్పెషల్ సాంగ్ ఈ సినిమాకు హైలెట్ గా నిలిచిన సంగతి తెలిసిందే. స్టార్ హీరో నాగార్జున చేతుల మీదుగా ప్రారంభమైన ఈ సినిమా నిర్మాతలకు కళ్లు చెదిరే స్థాయిలో లాభాలను అందించింది.

యమలీల సినిమా విడుదలకు రెండు వారాల ముందు భైరవద్వీపం సినిమా విడుదలైంది. ఈ సినిమా రిలీజ్ కు వారం రోజుల ముందు హలో బ్రదర్ సినిమా విడుదలైంది. ఎస్వీ కృష్ణారెడ్డి యమలీల సినిమాకు సీక్వెల్ గా యమలీల2 సినిమాను తెరకెక్కించారు. అయితే యమలీల సక్సెస్ సాధించిన స్థాయిలో యమలీల2 సక్సెస్ సాధించలేదు.