ఆ కారణం వల్లే నమ్రతను పెళ్లి చేసుకున్నా… మహేష్ బాబు కామెంట్స్ వైరల్!

టాలీవుడ్ ఇండస్ట్రీలో సూపర్ స్టార్ గా పేరు సంపాదించుకున్న మహేష్ బాబు గురించి అందరికీ సుపరిచితమే. తాజాగా ఈయన నటించిన సర్కార్ వారి పాట సినిమా విడుదలై మిశ్రమ స్పందన దక్కించుకుంది. ఇకపోతే ఈ సినిమా ప్రమోషన్ కార్యక్రమాలను పెద్దఎత్తున నిర్వహించారు.ఇక ఈ ప్రమోషన్ కార్యక్రమాల్లో భాగంగా మహేష్ బాబు ట్విట్టర్ ఇంస్టాగ్రామ్ వేదికగా అభిమానులు అడిగిన ప్రశ్నలకు సమాధానం ఇస్తూ సినిమాపై భారీ అంచనాలు పెంచేలా చేశారు. ఈ విధంగా మహేష్ బాబు ఇన్స్టాగ్రామ్ ద్వారా నెటిజన్లు అడిగిన ప్రశ్నలకు సమాధానం తెలియజేశారు.

ఇలా సోషల్ మీడియా వేదికగా మహేష్ బాబుకు తన పిల్లలు, తన భార్య గురించి ఎన్నో రకాల ప్రశ్నలు ఎదురయ్యాయి. ఈ క్రమంలోనే ఒక నెటిజన్ ప్రశ్నిస్తూ నమ్రతలో మీకు నచ్చిన విషయం ఏమిటి? అని ప్రశ్నించారు. ఈ ప్రశ్నకు మహేష్ బాబు సమాధానం చెబుతూ.. తనలో అన్ని క్వాలిటీలు నచ్చాయి కనుక నమ్రతను పెళ్లి చేసుకున్నానని మహేష్ బాబు సమాధానం చెప్పారు. ఈ విధంగా నమ్రత గురించి మహేష్ బాబు చేసిన ఈ కామెంట్ సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.

పెళ్లి కాకముందు నమ్రత కూడా పలు సినిమాలలో నటిగా నటించి మంచి పేరు సంపాదించుకున్నారు. అయితే మహేష్ బాబును పెళ్లి చేసుకున్న తర్వాత ఈమె పూర్తిగా నటనకు స్వస్తి చెప్పి కేవలం ఇంటి బాధ్యతలను చక్కగా నిర్వర్తిస్తూ ఒక మంచి భార్యగా, కోడలిగా, తల్లిగా పేరు సంపాదించుకున్నారు. మహేష్ బాబు తన సినిమాలతో బిజీగా ఉండటం వల్ల నమ్రత ఇంటి బాధ్యతలతో పాటు పిల్లల బాధ్యతలను ఎంతో చక్కగా నిర్వర్తిస్తూ ఉంటారు.