మహేష్ బాబు ఎఫెక్ట్… హిందీలో భారీగా తగ్గిన మేజర్ కలెక్షన్స్!

మహేష్ బాబు నిర్మాణంలో మేజర్ సందీప్ ఉన్నికృష్ణన్ జీవిత కథ ఆధారంగా శశికిరణ్ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం మేజర్. ఈ సినిమాలో అడివి శేష్ ప్రధాన పాత్రలో నటించారు. ఈ సినిమా జూన్ 3వ తేదీ విడుదల అద్భుతమైన కలెక్షన్లను రాబట్టింది. ఇక ఈ సినిమా రెండు తెలుగు రాష్ట్రాలతో పాటు విదేశాలలో కూడా పెద్ద ఎత్తున కలెక్షన్లను రాబట్టింది. మొదటి రోజు రెండు తెలుగు రాష్ట్రాలలో 6.10 కోట్లు (రూ. 4 కోట్ల డిస్ట్రిబ్యూటర్ షేర్) వసూలు చేసి సరికొత్త రికార్డులను సృష్టించింది.అయితే తెలుగులో ఈ సినిమాకి వచ్చిన విధంగా హిందీలో ఈ సినిమా కలెక్షన్లు రాబట్టలేకపోయింది.

హిందీలో మొదటిరోజు ఈ సినిమా రూ. 96 లక్షలు (రూ. 55 లక్షల డిస్ట్రిబ్యూటర్ షేర్) వసూలు చేసింది. ఈ విధంగా దేశ విదేశాలలో ఈ సినిమా పెద్ద ఎత్తున ప్రశంసలు అందడమే కాకుండా భారీ వసూళ్లను రాబట్టి నప్పటికీ హిందీలో మాత్రం ఏ సినిమా కలెక్షన్లను రాబట్టక పోవడానికి మహేష్ బాబు కారణమని పెద్ద ఎత్తున వార్తలు వినపడుతున్నాయి.మహేష్ బాబు ఈ సినిమా ట్రైలర్ లాంచ్ కార్యక్రమంలో భాగంగా బాలీవుడ్ ఎంట్రీ గురించి చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపాయి. బాలీవుడ్ నన్ను భరించలేదు అంటూ మహేష్ బాబు వ్యాఖ్యలపై కొందరు బాలీవుడ్ సెలబ్రిటీలతో పాటు ఇండియన్ ప్రేక్షకులకు విమర్శలు చేశారు.

మహేష్ బాబు చేసిన ఈ వ్యాఖ్యల కారణంగానే మేజర్ సినిమా కలెక్షన్లు భారీగా తగ్గాయని తెలుస్తోంది.అయితే మహేష్ బాబు ఇలా మాట్లాడటంతో కొందరు బాలీవుడ్ ప్రేక్షకులు ఆయనకు మద్దతు తెలుపుతూ ఆయన చేసిన వ్యాఖ్యలు ఏమాత్రం తప్పులేదని కొనియాడారు. అయితే నార్త్ ప్రేక్షకులకు మహేష్ బాబు పై ఏ స్థాయిలో కోపం ఉందో మేజర్ సినిమా కలెక్షన్లు చెబుతున్నాయి అంటూ పలువురు ఈ సినిమా హిందీ కలెక్షన్లపై వారి అభిప్రాయాలను ఇలా వ్యక్తం చేస్తున్నారు.