మహేష్ బాబు కూతురి సాహసాలు చూస్తే షాక్ అవ్వాల్సిందే… డేంజర్ స్టంట్ చేస్తున్న సితార!

టాలీవుడ్ స్టార్ హీరో మహేష్ బాబు గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఇలా ఇండస్ట్రీలో స్టార్ హీరోగా వెలుగొందుతున్నాడు. మహేశ్ బాబు కూతురూ సితార గురించి కూడ తెలియని వారుండరు. చిన్నప్పటి నుండి క్యూట్ లుక్స్ తో అందరినీ ఆకట్టుకుంది. అంతే కాకుండా ప్రస్తుతం సితార సోషియల్ మీడియాలో కూడా చాలా ఆక్టివ్ గా ఉంటోంది. తన క్యూట్ ఫోటోలు, వీడియోలు ఇన్ స్టా గ్రామ్ ద్వారా షేర్ చేస్తూ ఫాలోయర్స్ ని పెంచుకుంటుంది.

ఇటీవల సితార చేసిన కూచిపూడి డాన్స్ వీడియో కూడా బాగా వైరల్ అయ్యింది. అంతే కాకుండా తన నాన్న గారి సినిమాలోని పాటలు పాడుతూ స్టెప్పులు వేస్తూ వీడియోలు షేర్ చేస్తోంది. తాజాగా విడుదలైన మహేశ్ బాబూ సినిమా సర్కారు వారి పాట సినిమా ద్వార సిల్వర్ స్క్రీన్ మీద మెరిసింది. ఈ సినిమాలో పెన్నీ పెన్నీ సాంగ్ ప్రోమోలో సితార తన స్టెప్పులతో ప్రేక్షకులని ఆకట్టుకుంది. అతి చిన్న వయసులోనే ఇంస్టాగ్రామ్ లో దాదాపు ఎనిమిది లక్షలకు పైగా ఫాలోయర్స్ ని దక్కించుకుంది.

తాజాగా సితార చిన్న వయసులోనే హార్స్ రైడింగ్ వంటి సాహసాలు చేస్తోంది. తాజాగా సితార హార్స్ రైడింగ్ చేసే వీడియో ఇంస్టాగ్రామ్ లో షేర్ చేసింది. ఈ వీడియోలో సితార ట్రైనర్స్ పర్యవేక్షణలో గుర్రపు శాలలో హార్స్ రైడింగ్ చేస్తోంది. అంతే కాకుండా గుర్రం మీద రెండు చేతులు వదిలేసి సాహసాలు చేస్తోంది. గుర్రానికి ఆహారం పెట్టి దానిని మచ్చిక చేసుకుంటోంది. ఈ వయసులోనే ఇంతటి సాహసాలు చేస్తున్న సితార పెరిగి పెద్దయ్యాక ఇంకా ఏలాంటి సాహసాలు చేస్తుందో మరి. ప్రస్తుతం సీతార హార్స్ రైడింగ్ కి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.