సితార ఈ పేరు గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. స్టార్ కిడ్ గా అతి చిన్న వయసులోనే విపరీతమైన క్రేజ్ సంపాదించుకున్న వారిలో సితార ఘట్టమనేని ఒకరు.మహేష్ బాబు నమ్రత ముద్దుల కూతురుగా అందరికీ సుపరిచితమైన సితార ఇంత చిన్న వయసులోనే తన అద్భుతమైన తెలివితేటలు ప్రదర్శిస్తూ ఎంతో మంది అభిమానులను సంపాదించుకున్నారు. ఈ క్రమంలోనే నేడు మదర్స్ డే సందర్భంగా సితార ఒక ఇంటర్వ్యూ లో పాల్గొని ఆసక్తికరమైన ప్రశ్నలకు సమాధానం చెప్పారు. మదర్స్ డే సందర్భంగా మా అమ్మకు గిఫ్ట్ ప్లాన్ చేశానని, ఈ రోజు మొత్తం అమ్మతో గడపాలని ఫిక్స్ అయ్యాను అంటూ సితార చెప్పుకొచ్చారు.
ఇకపోతే ఈ సితార ఈ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ పలు ప్రశ్నలకు సమాధానం చెప్పారు. అమ్మ కోప్పడితే ఏం చేస్తారని ప్రశ్నించగా..ఏ విషయంలో నైనా అమ్మ కోప్పడిన నో అని చెప్పిన వెళ్లి నాన్నకు కంప్లైంట్ చేస్తాను అని సితార ఇంటర్వ్యూ సందర్భంగా తెలియజేశారు. అలాగే తన ప్రతి ఒక్క విషయంలోనూ అమ్మ సపోర్ట్ తనకు ఎంతో ఉంటుందని సితార వెల్లడించారు. ఇక తాజాగా సర్కారీ వారి పాట సినిమాలో భాగంగా పెన్ని పాటలో సితార నటించిన సంగతి మనకు తెలిసిందే. ఈపాట షూట్ సమయంలో అమ్మ హెల్ప్ ఎంతవరకు ఉంది అని ప్రశ్నించారు.
ఈ సినిమాలోని పాట షూటింగ్ జరుగుతున్నంతసేపు అమ్మతో పాటు తన డాన్స్ టీచర్ అనీ మాస్టర్ నా వెంటే ఉండి ప్రతి ఒక్క విషయాన్ని తెలియజేశారు. ఎక్స్ప్రెషన్స్, ఎలా ఉండాలి అనే విషయంలో అమ్మ నన్ను గైడ్ చేశారు. అలాగే ప్రతి ఒక్క విషయంలోనూ అమ్మ ముందుకు నడిపించారని సితార తెలియజేశారు. పాట షూటింగ్ పూర్తి అయ్యాక నా ఫస్ట్ ఆన్ స్క్రీన్ ప్రెజెన్స్ బాగా రావడంతో అమ్మ చాలా హ్యాపీ ఫీలయింది. నన్ను గర్వపడేలా చేశావు అంటూ గట్టిగా హత్తుకున్నారు.నాకు చాలా సంతోషంగా అనిపించిందనీ తన తల్లి గురించి ఎన్నో విషయాలను పంచుకున్నారు. ప్రతి ఒక్క విషయంలోనూ అమ్మ తనకు ఎంతో సపోర్ట్ గా ఉంటుందని అయితే తాను ఏ పని చేసిన అన్నింటికీ లిమిట్స్ ఉంటాయని సితార తెలియజేశారు.