Mahesh Babu: నా డబ్బులన్ని అమ్మమ్మ తీసుకునేది : మహేష్ బాబు

Mahesh Babu: బాలయ్య హోస్ట్ గా వ్యవహరిస్తున్న అన్ స్టాపబుల్ విత్ ఎన్బీకే టాక్ షో ఏ రేంజ్ లో హిట్ అయ్యిందో మనందరికీ తెలిసిందే. బాలయ్య బాబు తనలోని మరొక టాలెంట్ ని ప్రేక్షకులకు పరిచయం చేస్తూ ఈ టాక్ షో ద్వారా ప్రేక్షకులను అలరించారు. ఇక ఇప్పటికే దాదాపుగా పది ఎపిసోడ్ లు పూర్తి కాగా చివరి ఎపిసోడ్ గ్రాండ్ ఫినాలే ఎపిసోడ్ కావడం విశేషం. ఇక ఈ గ్రాండ్ ఫినాలే ఎపిసోడ్ కి అతిథిగా టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు హాజరుకానున్న విషయం తెలిసిందే. ఇప్పటికే అందుకు సంబంధించిన ప్రోమోలు,ఫోటోలు,వీడియోలు సోషల్ మీడియాలో పెద్దఎత్తున వైరల్ అయ్యాయి. అయితే ఈ ఎపిసోడ్ కోసం మహేష్ అభిమానులు ఎంతగానో ఎదురు చూస్తున్నారు.

ఇక తాజాగా ఎపిసోడ్ ఓటీటీ లో స్ట్రీమింగ్ అవుతోంది అని తెలుస్తోంది. అయితే మహేష్ బాబు సినీ కెరీర్ కు సంబంధించిన విషయాలు చాలా మందికి తెలుసు. కానీ అతని వ్యక్తిగత జీవితానికి సంబంధించిన చాలా విషయాలు తన అభిమానులకు తెలియవు. కానీ తాజాగా మహేష్ బాబు పాల్గొన్న టాక్ షోలో అందుకు సంబంధించిన విషయాలను వెల్లడించారు. ఈ క్రమంలోనే మహేష్ బాబు మాట్లాడుతూ.. సాయంత్రం 6 గంటల వరకు షూటింగ్ లో పాల్గొంటారని, ఆరు తర్వాత తనకు నిద్ర వస్తుంది అని తెలిపారు మహేష్ బాబు.తన కొడుకు, కూతురు తన సినిమాను ఎంజాయ్ చేస్తే కొంచెం సంతోషంగా ఉంటుందని మహేష్ బాబు వెల్లడించారు.

అలాగే తన కూతురు కొడుకు ఇద్దరు ఎక్కువగా చిన్న చిన్న విషయాలకు గొడవలు పడుతూ ఉంటారు అని చెప్పుకొచ్చారు మహేష్ బాబు. ఆ తరువాత బాలయ్య షోలో ఒక ఫోటోను చూపించగా ఆ ఫోటోలో తాను, తన సిస్టర్ ప్రియ ఉన్నామని తెలిపారు మహేష్.ఈ ఫోటో బర్త్ డే ఫంక్షన్ సమయంలో దిగిన ఫోటో అని అన్నారు.తన బర్త్ డే ఫంక్షన్ గ్రాండ్ గా జరిగేదని, అందరూ వచ్చి 2 వేలు, 3 వేల రూపాయలు డబ్బులు ఇచ్చేవారని మహేష్ బాబు చెప్పుకొచ్చారు. ఆ డబ్బులు అన్నీ కూడా తన అమ్మమ్మ తీసుకునేవారని మహేష్ తెలిపారు. తాను చేసిన అల్లరికి అమ్మ ఎప్పుడూ కొట్టలేదని, కానీ అమ్మమ్మ మాత్రం కొట్టేవారని మహేష్ బాబు చెప్పుకొచ్చారు. అమ్మ, అమ్మమ్మ మధ్య 16 సంవత్సరాల డిఫరెన్స్ అని అమ్మమ్మ తనను పెంచారని మహేష్ బాబు తెలిపారు.