Mahesh Babu: ఇటీవలే సూపర్ స్టార్ తనయుడు, హీరో మహేష్ బాబు సోదరుడు అయిన రమేష్ బాబు మరణించిన విషయం తెలిసిందే. గత కొద్ది రోజులుగా కాలేయ సంబంధిత వ్యాధితో బాధపడుతున్న రమేష్ బాబు అకాల మరణం చెందారు. ఇప్పటికి రమేష్ బాబు మరణాన్ని ఘట్టమనేని కుటుంబ సభ్యులు, ఘట్టమనేని అభిమానులు జీర్నించులేకపోతున్నారు. అమ్మ రమేష్ బాబు మరణంతో ఒక్కసారిగా ఘట్టమనేని కుటుంబంలో విషాద ఛాయలు అలముకున్నాయి. రమేష్ బాబు మరణం ఘట్టమనేని అభిమానులకు తీరని శోకాన్ని మిగిల్చింది. తన ప్రాణానికి ప్రాణమైన అన్న చనిపోయిన కూడా మహేష్ బాబు రాలేని పరిస్థితిలో ఉండిపోయాడు.
రమేష్ బాబు చనిపోయిన సమయంలో మహేష్ బాబు కు కరోనా పాజిటివ్ కావడంతో కనీసం తన అన్న చివరి చూపులు కూడా రాలేకపోయారు. తన అన్నకు చిన్న జ్వరం వస్తే కూడా తట్టుకోలేని మహేష్ బాబు తన అన్న చనిపోయిన కూడా ఆఖరి చూపులు కూడా రాలేకపోయాడు. ఇదే విషయం మహేష్ బాబునే కాకుండా అతని ఫ్యామిలీని, అభిమానులు కూడా కలచివేసింది. ఇకపోతే ప్రస్తుతం కరోనా నుంచి మహేష్ బాబు కోలుకున్న విషయం తెలిసిందే. ఇక తాజాగా నేడు రమేష్ బాబు పెద్దకర్మ చేయగా, సోదరుడి పెద్దకర్మ కు మహేష్ బాబు హాజరయ్యారు. ఈ నేపథ్యంలోనే తన సోదరుడి చివరి క్షణం కూడా నోచుకోలేక పోయినందుకు మహేష్ బాబు కన్నీటిపర్యంతం అయినట్టు తెలుస్తోంది. మహేష్ బాబుకు తన అన్న రమేష్ బాబు అంటే ఎంతో ఇష్టం అన్న విషయం అందరికి తెలిసిందే.
ఇక ఇదే విషయాన్ని మహేష్ బాబు కూడా పలు సార్లు ప్రస్తావించారు. తన సోదరుడు చనిపోయిన రోజు మహేష్ బాబు ఎమోషనల్ అవుతూ చేసిన ట్వీట్ కూడా సోషల్ మీడియాలో తెగ వైరల్ అయ్యింది. ఆ ఇమోషనల్ ట్వీట్ బట్టి చూస్తే తన అన్నయ్య అంటే మహేష్ బాబు ఎంత ప్రేమ ఉందో అర్థమవుతుంది. ఇక ఆ ట్వీట్ లో మహేష్ బాబు ఈ విధంగా రాసుకొచ్చాడు.. మరొక జన్మంటూ ఉంటే మీరే ఎప్పటికి నా అన్నయ్య.. మిమ్మల్ని ఇప్పుడు ఎప్పుడు ప్రేమిస్తూనే ఉంటాను.. మహేష్ బాబు ఎమోషనల్ గా ట్వీట్ చేశాడు. ఇక రమేష్ బాబు పెద్దకర్మ లకు ఘట్టమనేని కుటుంబ సభ్యులతో పాటు, పలువురు బంధుమిత్రులు కూడా హాజరైనట్లు తెలుస్తోంది.