Mahesh Babu: జక్కన్న చెర నుంచి బయటపడిన మహేష్… ఫ్యామిలీతో విదేశాలకు జంప్!

Mahesh Babu: సూపర్ స్టార్ మహేష్ బాబు ప్రస్తుతం రాజమౌళి సినిమా పనులలో ఎంతో బిజీగా ఉన్న విషయం మనకు తెలిసిందే. రాజమౌళితో సినిమా అంటే దాదాపు రెండు మూడు సంవత్సరాలు ఆయన బందీ ఖానాలో ఉండి పోవాల్సిందే. ఇక తరచూ వెకేషన్ లకు వెళ్లే మహేష్ బాబు రాజమౌళితో సినిమాకు కమిట్ కావడంతో చాలామంది ఇకపై మహేష్ బాబు బయట తిరగడానికి ఛాన్స్ ఉండదు అంటూ కామెంట్లో చేశారు.

అందుకు అనుగుణంగానే జక్కన్న సైతం ఈ సినిమా షూటింగ్ ప్రారంభం కాగానే మహేష్ బాబు పాస్ పోర్ట్ లాక్కొని సీజ్ చేసేసారు. సింహాన్ని జైల్లో బంధించాను అనే విధంగా ఈయన ఒక పోస్ట్ చేశారు. ఇక ఈ పోస్టుకు మహేష్ బాబు కూడా తనదైన శైలిలోనే స్పందించారు. ఒక్కసారి కమిట్ అయితే నా మాట నేనే వినను అంటూ పోకిరి సినిమాలోని పండుగాడు డైలాగ్ కామెంట్ చేశారు.

ఇకపోతే తాజాగా మహేష్ బాబుకి సంబంధించి ఒక వీడియో వైరల్ అవుతుంది. ఇందులో భాగంగా రాజమౌళి నుంచి మహేష్ తిరిగి తన పాస్ పోర్ట్ తీసేసుకున్నారని తెలుస్తోంది. రాజమౌళి ఈ సినిమాకు సంబంధించి కొన్ని షెడ్యూల్స్ చిత్రీకరణ పూర్తి చేశారు. హైదరాబాద్ అలాగే ఒరిస్సాలో ఈ సినిమాకు సంబంధించిన కొన్ని షెడ్యూల్స్ చిత్రీకరణ పూర్తి కావడంతో చిన్న బ్రేక్ ఇచ్చారు.

ఇలా సినిమాకు బ్రేక్ రావడమే ఆలస్యం రాజమౌళి నుంచి మహేష్ బాబు తన పాస్ పోర్ట్ తీసేసుకుని తన కూతురితో కలిసి విదేశాలకు వెకేషన్ వెళ్ళిపోయారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన ఒక వీడియో వైరల్ అవుతుంది. ఎయిర్ పోర్ట్ లో మహేష్ బాబు తన కూతురితో కలిసి వెళ్తున్నారు. ఇలా వెళ్తూ వెళ్తూ తన పాస్ పోర్ట్ తాను తీసేసుకున్నాను అంటూ ఈయన పాస్ పోర్ట్ చూపిస్తూ వెళ్తున్నారు ప్రస్తుతం ఈ వీడియో వైరల్ అవుతుంది.