గాసిప్స్ : మహేష్ – త్రివిక్రమ్ సినిమా టైటిల్ ఆరోజు విడుదల?

సూపర్ స్టార్ హీరో మహేష్ బాబు హీరోగా డస్కీ బ్యూటీ పూజా హెగ్డే హీరోయిన్ గా స్టార్ దర్శకుడు త్రివిక్రమ్ కాంబినేషన్ లో ఒకొక్కరుతో హ్యాట్రిక్ సినిమా కోసం అందరికీ తెలిసిందే. మహేష్ బాబు కెరీర్ లో 28వ సినిమాగా వస్తుండగా ఈ చిత్రం షూటింగ్ కొత్త షెడ్యూల్ అయితే స్టార్ట్ కాబోతుంది.

మరి సినిమా అప్డేట్స్ పరంగా అయితే ఎలాంటి మిస్టేక్ లేకుండా చిత్ర యూనిట్ అదిరే అప్డేట్స్ ఒకొకటిగా అందిస్తుండగా ఇప్పుడు సినీ వర్గాల్లో సినిమా టైటిల్ కి సంబంధించి పలు గాసిప్స్ వినిపిస్తున్నాయి. దీనితో ఇప్పుడు ఈ సినిమాకి ఓ అదిరిపోయే టైటిల్ ని అయితే చిత్ర బృందం ఫిక్స్ చేశారట.

పైగా ఇది ఖచ్చితంగా ఫ్యాన్స్ ని నిరాశ పరచదు అని కూడా సినీ వర్గాల్లో వినిపిస్తున్న సమాచారం. దీనితో ఐతే మరి ఈ టైటిల్ ఎప్పుడు వస్తుంది అనేది కూడా తెలుస్తుంది. బహుశా ఈ సినిమా టైటిల్ అయితే ఈ దీపావళి సందర్భంగా రివీల్ చేయనున్నారని తెలుస్తుంది.

దీనిపై అధికారికంగా క్లారిటీ రావాల్సి ఉంది. ఇక ఈ చిత్రానికి థమన్ సంగీతం అందిస్తుండగా హారికా హాసిని క్రియేషన్స్ వారు భారీ బడ్జెట్ తో నిర్మాణం వహిస్తున్న సంగతి తెలిసిందే.