తండ్రి పుట్టిన రోజు సందర్భంగా శుభాకాంక్షలు తెలియచేసిన మహేష్ దంపతులు!

సీనియర్ హీరో సూపర్ స్టార్ కృష్ణ గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. టాలీవుడ్ లో ఎన్నో సూపర్ హిట్ సినిమాలలో నటించి సూపర్ స్టార్ గా గుర్తింపు తెచ్చుకున్నాడు. ఇండస్ట్రీలో ఏ స్టార్ హీరోలు చేయలేని సాహసం చేసి కొన్ని వైవిధ్యమైన సినిమాలలో కూడా నటించాడు. అయితే ఈ మధ్య అనారోగ్యం కారణంగా కృష్ణ పూర్తిగా ఇంటికే పరిమితమయ్యారు. ఇటీవల తన కూతురితో కలిసి యూట్యూబ్ ఛానల్ ద్వారా ఎన్నో ఆసక్తికర విషయాలు పంచుకున్నాడు. ఈ రోజు సూపర్ స్టార్ కృష్ణ తన 80 వ పుట్టినరోజును జరుపుకుంటున్నారు.

ఈ సందర్భంగా పలువురు సినీ ప్రముఖులు ఆయనకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తూ ఆయనతో తమకి ఉన్న అనుబంధం గురించి తెలియజేస్తున్నారు. ఇలా సినీ ప్రముఖులు మాత్రమే కాకుండా ఆయన అభిమానులు కూడా సోషల్ మీడియా వేదికగా కృష్ణ గారికి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. ఈ క్రమంలో సూపర్ స్టార్ కృష్ణ గారి తనయుడు మహేష్ బాబు కూడా సోషల్ మీడియా వేదికగా తన తండ్రికి పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలియజేశాడు. తన తండ్రి పుట్టిన రోజు సందర్భంగా మహేష్ బాబు శుభాకాంక్షలు తెలియజేస్తూ..” పుట్టినరోజు శుభాకాంక్షలు నాన్న.. నిజంగా మీలాంటివారు ఎవరు ఉండరు. ఏంతో కాలం మీరు మరింత ఆరోగ్యంగా, సంతోషంగా ఉండాలని కోరుకుంటున్నా. లవ్ యు నాన్న” అంటూ పోస్ట్ చేసాడు.

ఈ క్రమంలో మహేష్ బాబు భార్య నమ్రత కూడా తన మామ గారి పుట్టినరోజు సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేసింది. ఇంస్టాగ్రామ్ వేదికగా కృష్ణ గారికి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తూ..” మీతో మాకి ఉన్న అనుబంధం చాలా విలువైనది. నా భర్తతో పాటు నాకు కూడా తండ్రిలా ప్రేమ, ఆప్యాయతలు పంచినందుకు ధన్యవాదాలు. మీకు పుట్టిన రోజు శుభాకాంక్షలు మామయ్య. ఎప్పుడు మేము నిన్ను ప్రేమిస్తూనే ఉంటాం” అంటూ రాసుకొచ్చింది.